Movies

అరుంధతి-2గా పాయల్

Payal Rajput To Star In Arundhathi2 Arundathi2

అనుష్క కథానాయికగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన సినిమా ‘అరుంధతి’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని ‘అరుంధతి’, ‘పశుపతి’ పాత్రలు అనుష్క, సోనూసూద్‌ కెరీర్‌లకు బ్రేక్‌ ఇచ్చాయి. కాగా ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అరుంధతి 2’ రాబోతోంది. శ్రీ శంఖు చ‌క్ర ఫిల్మ్స్‌ ప‌తాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథానాయిక పాయ‌ల్ రాజ్‌పుత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.