కథానాయిక రెజీనాకు నిశ్చితార్థం జరిగిందని ఇటీవల తెగ ప్రచారం జరిగింది. చెన్నైలో ప్రియుడితో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, వచ్చే నెల వివాహం జరగనుందని రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలపై రెజీనా మేనేజర్ స్పందించారు. ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేశారు. ‘ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచీ వస్తాయో మాకు అర్థం కావడం లేదు. రెజీనాకు తెలుగు, తమిళ సినిమాల్లో చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఆమె స్క్రిప్టులు వింటున్నారు. వాటిలో నటించబోతున్నారు’ అని అన్నారు. రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ‘సెవెన్’ సినిమా ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఆమె ‘నెన్జమ్ మరప్పతిలై’, ‘పార్టీ’, ‘కల్లపార్ట్’ అనే తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఎవరు’ అనే తెలుగు సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇందులో అడివి శేషు కథానాయకుడి పాత్ర పోషించనున్నారు. వెంకట్ రాంజీ దర్శకుడు. ఆగస్టు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వదంతులు మాత్రమే
Related tags :