Movies

బిడ్డతో పాటే బాలయ్య కూడా

Sameera Reddy To Pair With Balakrishna For His Next Movie

ప్రెగ్నెంట్ హీరోయిన్ సమీరా రెడ్డి ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మరో రెండు నెలల్లోనే రెండో బిడ్డకు తల్లికాబోతున్న ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫోజులిస్తూ జానాల నోళ్లను బాగా నానుతున్నారు. సమీరాకు సంబందించిన ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతోంది. ఇటీవలే తన కుటుంబం ఫ్రెండ్స్ అందరి మధ్య సీమంతం జరుపుకున్న సమీరా రెడ్డి మరో రెండు నెలల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. పెళ్లి తరువాత చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ ఈ మధ్య కాలంలో మీడియాతో తరచుగా ఇంత్రాక్స్ట్ అవుతోంది. రాజమండ్రీలో పుట్టి ముంబైలో పెరిగిన సమీరాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ఈనేపద్యంలో ఓ మీడియా సమావేశంలో ఆమె తానూ తిరిగి తెలుగు సినిమాల్లో నటించేందుకు సుముఖంగా ఉన్నానని తెలిపి ఆశ్చర్యపరిచింది. తాజాగా అందిన సమాచారం మేరకు నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో సమీరా హీరోయిన్ చాన్స్ పట్టేసిందని తెలుస్తోంది. బాలయ్య 105గా తమిళ దర్శకుడు కే ఎన్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సమీరా హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈసినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని ఎగ్యులర్ షూటింగ్ కి రెడీ అయ్యింది. సమీరా కేమో దేలివారికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. దీంతో ఇలాంటి తరుణంలో ఆమె బాలయ్య చెంత చేరి చిందులేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఇదిలా బాలయ్య సినిమాలో మేహ్రిన్, తమన్నా, శ్రీయా , ర్పాయాల్ రాజ్ పుత్ ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. చూడాలి మరి చివరకు ఎ హీరోయిన్ కు బాలయ్యతో చిందులేసే అవకాశం దక్కేనో ఇక ఈ సినిమాకు రూలర్ టైటిల్ ఫైనల్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.