Food

గంజి బలం పుంజెడు

Starch From Cooking Rice Is Highly Nutritious

మ‌న ఇండ్ల‌లో అన్నం వండేట‌ప్పుడు వ‌చ్చే గంజి నీటిని చాలా మంది పార‌బోస్తుంటారు. నిజానికి అలా చేయ‌కూడ‌దు. గంజి నీటిలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల గంజినీటిని పార‌బోయ‌కుండా వాటిని గోరు వెచ్చ‌గా ఉండగానే అందులో చిటికెడు ఉప్పు వేసి తాగాలి. దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గంజి నీటిలో బి విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. విట‌మిన్ల లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు గంజి తాగిస్తే చాలా మంచిది. వారి ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది.

2. విరేచ‌నాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంట‌నే విరేచ‌నాలు త‌గ్గుతాయి.

3. ప‌సిపిల్ల‌లు పాలు స‌రిగ్గా తాగ‌క‌పోతే వారికి క‌నీసం గంజి నీటిని అయినా తాగించాలి. దాంతో వారికి కావల్సిన ఆహారం అంది శ‌క్తి ల‌భిస్తుంది. పోష‌ణ స‌రిగ్గా ఉంటుంది.

4. చ‌ర్మంపై దురద వ‌స్తుంటే ఆ ప్ర‌దేశంలో కొద్దిగా గంజినీటిని పోసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో దుర‌ద‌లు త‌గ్గిపోతాయి.

5. వేస‌విలో శ‌క్తి త్వ‌ర‌గా అయిపోయి ఎవ‌రైనా స‌రే నీర‌సం చెందుతుంటారు. అలాంటి వారు గంజి నీరు తాగితే మంచిది. శ‌క్తిని మ‌ళ్లీ పుంజుకుంటారు.