ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింతగా తీసుకెళ్లేందుకు వీలుగా గ్రామ వాలంటీర్ల నియమించాలని తలపెట్టిన జగన్ ప్రభుత్వం అందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 (జూన్ 22) నుంచి జులై 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రతి 50కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ చొప్పున నియామకానికి మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామం, వార్డు వాలంటీర్ల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. స్థానికులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది.
ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తుల స్వీకరణ- జూన్ 24 నుంచి జులై 5 వరకు
* దరఖాస్తుల పరిశీలన- జులై 10 నుంచి
* ముఖాముఖి- జులై 11 నుంచి 25 వరకు
* ఎంపికైన వారికి ఆగస్టు 1న నియామక పత్రాలు
* వాలంటీర్లకు శిక్షణ- ఆగస్టు 5 నుంచి 10 వరకు
అర్హతలు
* గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి
* గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్
* పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ
* వయసు- 2019 జూన్ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి.
* దరఖాస్తుదారు అదే పంచాయతీలో నివాసి అయ్యి ఉండాలి
*ఓసీ కానివాళ్లు కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.