నేటి ప్రపంచంలో అదీ ఈ యాంత్రిక జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చే ఎక్కువ. ఇక కేశ సంరక్షణ కోసమైతే చెప్పక్కర్లేదు. ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడట్లే. అయితే సౌందర్యాన్ని కాపాడుకునేందుకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటితో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువే కాక ఖర్చు కూడా తక్కువ. అంతేకాకుండా ఎటువంటి రసాయనాల బెడదా ఉండదు. అలాంటివాటిల్లో మందార ఒకటి. మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, కేశ సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మాన్ని, వెంట్రుకలను మ దువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మందార నూనెను జుట్టుకు రాయడంవల్ల చుండ్రుని నివారించవచ్చు. తరచూ ఈ నూనెని వాడటం వల్ల తెల్లజుట్టు రాకుండా జాగ్రత్తపడవచ్చు. మందార పువ్వులు అందానికి ఎంతో దోహదపడుతాయి. తరచు మందార పువ్వుతో ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా, మ దువుగా మారుతుంది. అంతేకాదు, ఈ మందార పువ్వు పొడిని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మందార ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు సమ ద్ధిగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగించటానికి సహాయం చేయుట వలన వ ద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మందార పువ్వుతో టీ తయారుచేసి తీసుకుంటే చాలా మంచిది.. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. రక్త సరఫరా పెరుగుతుంది. మందార టీని మందార మొక్క భాగాలను మరిగించటం ద్వారా తయారు చేస్తారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ టీ తాగాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.
**మందార టీ తయారుచేసే విధానం
ఒక పాత్రలో కొంత నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని స్టవ్ మీద నుంచి దించాలి. కొన్ని మందార పూలను తీసుకుని వాటిలో తొడిమ, పుప్పొడి భాగాలను తొలగించి కేవలం పువ్వు రెక్కలను మాత్రమే తీసుకోవాలి. వాటిని మరిగించిన నీటిలో వేసి అలాగే 15 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం ఆ నీటిని వడకట్టాలి. ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, తేనె వంటివి వేసి కలుపుకుని వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా మందార పువ్వులను తెచ్చి టీలను తయారు చేసుకోలేని వారి కోసం మందార టీ బ్యాగ్‌లు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిని కూడా వాడవచ్చు.
**మందార నూనె తయారీ
మందార నూనెను ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోచ్చు. హైబిస్కస్ హెయిర్ ఆయిల్‌ను ఏవిధంగా తయారుచేసుకోవాలి, ఎలా వాడాలో తెలుసుకుందాం.. 1. మందారం, కొబ్బరి నూనె ఈ కాంబినేషన్ నూనెను తయారుచేసుకోవడం చాలా సులభం. అందుకు కొబ్బరి నూనె, మందారం పువ్వులు ఉంటే చాలు. నిల్వ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ అవసరం అవుతుంది.
కావల్సిన పదార్థాలు: 20 మందారం పువ్వులు 500గ్రాముల కొబ్బరి నూనె ఒక పాన్
తయారు చేయు విధానం: ఒక పాన్ లో కొబ్బరి వేసి, తక్కువ మంట మీద వేడి చేయాలి. కొబ్బరి నూనె 5 నిమిషాలు వేడి అయ్యాక అందులో 10-15 మందారం పువ్వులను వేయాలి. కొబ్బరి నూనెతో పాటు మందారం పువ్వులూ మరుగుతాయి. కొబ్బరి నూనె డార్క్ ఎల్లో లేదా డార్క్ రెడ్ రంగులోకి మారుతుంది. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి, మిగిలిన పువ్వులను కూడా ఆ నూనెలో వేయాలి. ఇలా వేడి చేసిన నూనెను రాత్రంతా అలాగే చల్లా ర్చాలి. ఈ హైబిస్కస్ నూనెను గ్లాస్ జార్ లోనికి వడగట్టుకుని, నిల్వ చేసుకుని, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి
మీ కేశాలకు మందార బంధనం. అదే అసలైన అందం.
Related tags :