నిద్ర అనేది మనకు అవసరమే. దాంతో శరీరం పునరుత్తేజం చెందుతుంది. కణజాలం మరమ్మత్తు అవుతుంది. కొత్త శక్తి వస్తుంది. అందుకే ఎవరైనా నిత్యం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరు ఈ సమయం పాటించరు. చాలా తక్కువ గంటలు నిద్రిస్తారు. ఇక కొందరైతే ఏకంగా 10 గంటల పాటు రోజూ నిద్రిస్తుంటారు. నిజానికి నిద్ర తక్కువ అయితే ఏయే అనారోగ్య సమస్యలు వస్తాయో, నిద్ర మరీ ఎక్కువగా పోయినా అవే అనారోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం 10 గంటలు నిద్రించే వారికి డయాబెటిస్, స్థూలకాయం, తలనొప్పి, వెన్ను నొప్పి, డిప్రెషన్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించే వారితో పోలిస్తే 10 గంటల కన్నా ఎక్కువగా నిద్రించే వారికే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని వారు అంటున్నారు. చాలా మంది తాము కావల్సిన దానికన్నా ఎక్కువగానే నిద్రిస్తున్నామని భావిస్తారని, కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదని, రోజూ తగినన్ని గంటలే నిద్రించాలని వైద్యులు కూడా చెబుతున్నారు. కనుక రోజూ 10 గంటల కన్నా ఎక్కువగా ఎవరైనా నిద్రిస్తుంటే.. వెంటనే వారు తమ అలవాటును మానుకోవడం ఉత్తమం. లేదంటే పైన చెప్పిన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు..!
అతినిద్ర కూడా అనర్థమే
Related tags :