తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్న తపన ప్రతి ఒక్క తల్లిదండ్రులకూ ఉంటుంది. ఎంత చేసినా ఇంకా చేయాలనే ఆరాటపడుతుంటారు. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ తక్కువ సమయంలోనే వారు అభివృద్ధి చెందాలనుకుంటారు. వాళ్లు డాక్టర్ చదువుతాను అంటే.. కాదు.. ఇంజినీరింగ్ చదువు.. మంచి భవిష్యత్ ఉంటుంది అని చెబుతుంటారు. పిల్లలు జీన్ ఫ్యాంట్ వేసుకుంటానంటే.. వద్దు.. చుడీదార్ వేసుకో పద్ధతిగా కనిపిస్తుంది అని అంటుంటారు. ఇలా వారి అభిప్రాయాలకు విలువివ్వకుండా… తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం సరికాదంటున్నారు నిపుణులు. వారికి దేనిపై ఆసక్తి ఉందో అందులోనే వాళ్లు రాణించేలా చూడాలంటున్నారు. అంతేకాకుండా పిల్లలు ఏదైనా విజయం సాధించినప్పుడు కుటుంబమంతా ఆ విజయాన్ని ఆస్వాదించాలని చెబుతున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, మరిన్ని విజయాలు సాధించడానికి బాటలు వేస్తుందట.
మీ అభిప్రాయాలు పిల్లలపై రుద్దకండి
Related tags :