ప్రపంచంలోని ప్రభుత్వాలు సోషల్ మీడియా ప్రభావానికి గడగడలాడుతున్నాయి. క్షణాల్లో తప్పుడు సమాచారం కావొచ్చు సక్రమ సమాచారం అయినా ప్రపంచం నలుమూలలకు చేరిపోతుంది. ఇందులో ప్రధాన భూమిక వహిస్తుంది వాట్స్ అప్. ఈ సోషల్ మీడియా ప్రభావానికి కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే కుప్పకూలాయి. మరికొన్ని దేశాల్లో ఉద్యమాలు వీటిమీదే పురుడుపోసుకున్నాయి. ప్రజల్లో తీవ్ర ప్రభావితమైన ఈ మీడియా లో అసత్య సమాచారం అడ్డుకోవడంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే వాట్స్ అప్ కి మార్గం వెతకాలంటూ ఫిర్యాదు చేస్తున్నాయి. తప్పుడు వార్తల ప్రచారం వెనుక సృష్టికర్త ఎవరో తెలుసుకునేందుకు ఇప్పుడు డిజిటల్ సంతకం అనే ఫీచర్ ను వాట్స్ అప్ యాడ్ చేయబోతుంది. దీనివల్ల ఎవరు ఒక సమాచారం వెనుక ఉన్నారనేది తెలిసిపోతుంది. దాంతో ఫేక్ న్యూస్ లు సృష్టించే వారి బండారం బట్టబయలు చేయడంతో బాటు వారిపై కఠిన చర్యలకు ఆస్కారం ఏర్పడుతుంది. వేలిముద్ర ఆధారంగా ఈ ఫీచర్ ను వాట్స్ అప్ ప్రవేశ పెట్టనుంది. దీనినే డిజిటల్ సంతకం గా చెబుతున్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వాట్స్ అప్ యాజమాన్యం పేర్కొంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా సింగపూర్ లలో గ్రూప్ చాటింగ్ కి సంబంధించి వాటిని పరిశీలించి చర్యలకు పోలీసులకు ఆ దేశాలు అధికారాన్ని కట్టబెట్టాయి కూడా. భారత్ కూడా ఫేక్ న్యూస్ నిరోధానికి చర్యలు చేపట్టాలని ఇప్పటికే వాట్స్ అప్ ను కోరింది. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోతున్న డిజిటల్ సంతకం సంచలనాల కోసం ప్రయత్నం చేసి తప్పుడు వార్తలు సృష్టించే వారిని కటకటాల పాలు చేయడం ఖాయమంటున్నారు. చూడాలి ఈ ఫీచర్ ఈమేరకు ప్రయోజనం చేకురుస్తుందో.
వాట్సాప్‌లో డిజిటల్ సంతకం తప్పనిసరి
Related tags :