Devotional

ప్రమాణస్వీకారం చేసిన వై.వి.సుబ్బారెడ్డి

YV Subbareddy takes charge as TTD Chairman

తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో జరిగిన కార్యక్రమంలో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. వైవీ సుబ్బారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజు, పాలక మండలి మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.