Devotional

ఏమిలేనితనమే కృష్ణుడికి దగ్గర చేసింది

Flute Replies To Rukmini Question That Her Vacuum Is What Attracts Lord Krishna

ఓసారి రుక్మిణి కృష్టుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగింది”విడవకుండా కృష్టుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడుకదా!పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేశావు? ఆరహస్యం నాకు దయచేసి చెప్పు”

అందుకు వేణువునవ్వి ఇలా అన్నది “నాలోపల డొల్లతప్ప ఏంలేదు ఆ ఏమీలేకపోవడమే నన్ను ఆ ఆ నందకిశోరునికి దగ్గరచేసింది.

కాబట్టి ఎవరైతే ప్రాపంచిక విషయాలని మనసులోంచి పూర్తిగ తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆ మాధవునితో సదా ఉండగలుగుతారు.ఎవరైనా సరే ఈఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుకోగలిగితే చాలు.