దానిమ్మ పండు మనకు ఏ సీజన్‌లో అయినా దొరుకుతుంది. చక్కని రంగులో తినడానికి రుచికరంగా ఉండే ఈ పండు ద్వారా మనకు అనేక పోషకాలు లభిస్తాయి. పొటాషియం, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నిషియం వంటి ఎన్నో పోషకాలు దానిమ్మ పండ్లలో ఉంటాయి. ఈ క్రమంలోనే రోజుకో దానిమ్మ పండును ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు దానిమ్మ పండ్లలో పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్లు రావు. ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.
2. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. సంతానం లేని వారికి దానిమ్మ పండును ఒక వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే దంపతులు ఇద్దరూ రోజూ దానిమ్మ పండును తింటే వారి శృంగార సమస్యలు పోవడమే కాదు, ఆ శక్తి కూడా పెరుగుతుంది. స్త్రీలలో రుతుక్రమం సరిగ్గా అవుతుంది. తద్వారా సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
4. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
5. ఎముకలు దృఢంగా మారుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ తగ్గుతుంది. రక్తం పెరుగుతుంది. రక్త సరఫరా బాగా జరుగుతుంది.
6. దంత సమస్యలు ఉండవు. చిగుళ్ల వాపు, నొప్పి తగ్గుతాయి. నోటి దుర్వాసన పోతుంది.
7. డయేరియా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.