ప్రముఖ నటుడు అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నేర్కొండ పార్వాయ్’. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘పింక్’కు ఇది రీమేక్‌గా రాబోతోంది. ‘పింక్’ సినిమాలో తాప్సి కీలక పాత్రలో నటించారు. అయితే తమిళంలో తాప్సి పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆ పాత్రలో తానే నటించాలని అవకాశం వచ్చినా ఒప్పుకొనేదాన్ని కాదని తాప్సి అంటున్నారు. ఈ విషయం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నాకు ‘నేర్కొండ పార్వాయ్’ చిత్రంలో అవకాశం రాలేదు. ఒకవేళ వచ్చినా నటించేందుకు ఒప్పుకొనేదాన్ని కాదు. ఎందుకంటే ఆ పాత్ర చాలా భావోద్వేగంతో కూడినది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయి పడే బాధను ఆ పాత్రలో చూడొచ్చు. నేను ‘పింక్’ సినిమాలో ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. మళ్లీ అదే పాత్రలో ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాలో నటించే ధైర్యం నాకు లేదు. ఆ బాధను భరించలేను. మున్ముందు అజిత్ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. కానీ ఈ సినిమాలో మాత్రం నటించలేను’ అని వెల్లడించారు. ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాకు వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అతనితో వద్దు
Related tags :