Politics

పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్నారు

TDP Used Polavaram As ATM - We Will Dig Every Scam Says Vijayasaireddy

ప్రజావేదికను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై అధికార, విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి ట్విట‌ర్‌లో స్పందించారు.

‘ప్రజావేదిక’ ప్రభుత్వ నిధులతో నిర్మించిన సదుపాయం. టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు ఆ భ‌వ‌నాన్ని పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారు.

ఓడిపోయినా తన ఆక్రమణలోనే పెట్టుకున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సుకు సిద్ధం చేస్తుంటే బాబు లేనప్పుడు తాళాలు తీస్తారా?

అంటూ ఆ పార్టీ నాయకులు సానుభూతి డ్రామాలాడటం పరువు తీసుకోవడమేన‌ని మండిప‌డ్డారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా స్పందించారు.

పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమా అనడం, దమ్ముంటే తనను పట్టుకోమని దొంగ.. పోలీసులకు సవాలు విసిరినట్టుగా ఉందని ఎద్దేశా చేశారు.

అన్ని అనుమతులుండి, పనులు మొదలైన ప్రాజెక్టును ఐదేళ్ళు ఏటీఎంలాగా వాడుకున్నారని ఆరోపించారు.

మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు ఉమా. అని విజ‌య సాయిరెడ్డి హెచ్చ‌రించారు.