అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సీనియర్ నటి విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆమె 53వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌తోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘జన్మదిన శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీతో కలిసి మరోసారి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మహేశ్ పేర్కొన్నారు. ‘ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నా విజయశాంతి గారు. మీ రీ ఎంట్రీ గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా మేడమ్’ అని అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు. మహేశ్-అనిల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. విజయశాంతి నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ (1989) సినిమాలో మహేశ్ బాలనటుడిగా కనిపించారు. మహేశ్ కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. 200 సెంటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకను జూన్ 28న నిర్వహించబోతున్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించారు.
ఎదురుచూస్తున్నా
Related tags :