నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా ‘బంగార్రాజు’ తెరకెక్కబోతోంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ఇప్పటికే ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నటీనటులు ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఓ పూర్తిస్థాయి పాత్రలో సందడి చేయబోతున్నారు. నాగచైతన్య సరసన కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతోంది. ‘మహానటి’ తర్వాత కొన్నాళ్లు తమిళంలోనే బిజీగా గడిపిన కీర్తి ప్రస్తుతం తెలుగుపై దృష్టి పెట్టింది. కథానాయిక ప్రాధాన్యమున్న ఓ చిత్రంతో పాటు ‘మన్మథుడు 2’లో కీలక పాత్ర పోషిస్తోంది. ‘బంగార్రాజు’ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
కీర్తితో బంగార్రాజు
Related tags :