Food

రాగితో పిండి ఒక్కటే కాదు…వడియాలు కూడా పెట్టుకోవచ్చు.

Raagi Vadiyalu Easy Fast Short Recipe In Telugu - Food News In Telugu

*** కావల్సినవి:
బియ్యప్పిండి- రెండుకప్పులు, నీళ్లు- పన్నెండు గ్లాసులు, నూనె- ఐదుచెంచాలు, రాగి పిండి- కప్పు, ఉప్పు- నాలుగు చెంచాలు, అల్లం ముక్కలు- ఐదు చెంచాలు, నువ్వులు- రెండు చెంచాలు, జీలకర్ర- నాలుగు చెంచాలు, పచ్చిమిర్చి- ఆరు.

*** తయారీ:
ముందుగా రాగిపిండిన వేడి నీళ్లలో ఉంచాలి. పొయ్యిపై బాణలిపెట్టి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై బియ్యప్పిండి వేయాలి. ఈ మిశ్రమం బాగా మరుగుతున్నప్పుడు అందులో నూనె, ఉప్పు, అల్లం తరుగు, జీలకర్ర, నువ్వులు వేయాలి. కాసేపటికి అది పొంగుతుంది. అప్పుడు వేణ్నీళ్లలో కలిపి ఉంచుకున్న రాగి పిండిని అందులో వేసి కలపాలి. ఈ పిండి బాగా ఉడికి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. కాస్త చల్లారాక వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది.