సినీ నటి ఆర్తి చాబ్రియా వివాహం ఘనంగా జరిగింది. ఆమె చార్టెర్డ్ అకౌంటర్ విశరధ్ బీడసీను సోమవారం మనువాడారు. ముంబయిలో జరిగిన ఈ వేడుకకు పలువురు నటీనటులు హాజరయ్యారు. ఆర్తి ఎరుపు రంగు లెహెంగాలో మెరిశారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. మార్చి 11న ఆర్తి, విశరధ్ల నిశ్చితార్థం జరిగింది. విశరధ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు. త్వరలో ఆయన ముంబయికి షిఫ్ట్ కాబోతున్నారట.ఆర్తి బాలీవుడ్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. 2003లో ‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’, ‘గోపి గోడమీద పిల్లి’ చిత్రాల్లో నటిగా సందడి చేశారు. వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘చింతకాయల రవి’ సినిమాలోని ప్రత్యేక గీతంలో మెరిశారు. తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె 2013లో చివరిసారి ఓ పంజాబీ సినిమాలో కనిపించారు. ఆపై నటనకు దూరమయ్యారు.
ఛాబ్రియా షాదీ హోగయా
Related tags :