కొద్దిపాటి పనులకే నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తున్నాయా? అయితే విటమిన్ బి12, విటమిన్ డి లోపం ఉందేమో ఒకసారి చూసుకోండి.
* విటమిన్ బి12: ఇది లోపిస్తే రక్తహీనత.. ఫలితంగా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ బి12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తులతోనే లభిస్తుంది. అందుకే శాకాహారుల్లో చాలామందిలో దీని లోపం కనబడుతుంటుంది. మరోవైపు వయసు పెరుగుతున్నకొద్దీ మన శరీరం విటమిన్ బి12ను గ్రహించుకోవటమూ తగ్గుతుంది. పేగుల్లో పూత వంటి సమస్యలతోనూ ఈ సామర్థ్యం తగ్గుముఖం పడుతుంది. ఆహార అలవాట్ల మూలంగా లోపం తలెత్తితే- వాటిని మార్చుకోవటం, బి12 మాత్రలు తీసుకోవటం మేలు. ఇతరత్రా కారణాలతో లోపిస్తే- బి12 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
* విటమిన్ డి: ఇది లోపిస్తే ఎముకల, కండరాల పటుత్వం తగ్గి.. నీరసానికి దారితీస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు మన శరీరమే దీన్ని తయారుచేసుకుంటుంది. కాబట్టి రోజూ చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. టూనా, సాల్మన్ వంటి చేపలతోనూ ఇది లభిస్తుంది. ప్రస్తుతం విటమిన్ డిని కలిపిన పాలు, పళ్ల రసాలు, అల్పాహార తృణధాన్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. అవసరమైతే విటమిన్ డి మాత్రలూ వేసుకోవచ్చు.
నిత్య నీరసులకు ఇవి చిట్కాలు
Related tags :