సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడని సెలబ్రెటీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ట్రోలర్స్‌కు పీఎం, సీఎం అనే తేడా ఉండదు…..ఎంతటివారినైనా ఏకిపారేస్తారు. అఫ్‌కోర్స్ అవి శ్రుతిమించితే…కారాగారానికి వెళ్లక తప్పదనుకోండి. సోషల్ మీడియాలో జరిగే ఈ ట్రోలింగ్‌కు విరుగుడు దొరకడం కష్టం. గతేడాది బిగ్‌బిస్ షో వల్ల సోషల్‌మీడియాలో యుద్దాలు జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. కంటెస్టెంట్ల అభిమానులు సోషల్ మీడియాలో మాటల యుద్దానికి దిగడం.. ఒకరిపై ఒకరు దూషించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే హోస్ట్‌గా వ్యవహరించిన నానిని సైతం వదలపెట్టలేదు. ఇక బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించకూడదు అనేంతంగా నానిని ట్రోలింగ్‌కు గురిచేశారు.అయితే మొత్తానికి స్టార్ మా బృందం మూడో సీజన్‌ను నడిపించడానికి కింగ్ నాగార్జునతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‌బాస్ మూడో సీజన్‌కు సంబంధించిన ఫేస్‌బుక్,ట్విటర్ పేజీలు ప్రారంభమయ్యాయి. ఇక వీటిల్లో మూడో సీజన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వస్తూ ఉన్నాయి. హోస్ట్‌గా ఒక్క ఎపిసోడ్ చేయకముందే….నాగ్‌పై నెటిజన్లు కన్నేశారు. గతంలో దేవదాస్ మూవీ ప్రమోషన్స్‌లో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.బిగ్‌బాస్ షో గురించి అడగొద్దని…తాను బ్యాడ్‌గా మాట్లాడతానని అన్నారు. తనకు బిగ్‌బాస్ కాన్సెప్ట్ నచ్చదని, అవతలి వ్యక్తి ఏం చేస్తున్నాడని చూడటం లాంటివన్నీ తనకు నచ్చవని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మాటలను పట్టుకుని నాగ్‌ను టార్గెట్ చేస్తున్నారు. కర్మ అంటే ఇదే.. ఒకప్పుడు తనకు నచ్చదని చెప్పిన షోకే హోస్ట్‌గా చేస్తున్నాడని ఒకరు…..ఎక్కువ డబ్బు ఆఫర్ చేసి ఉంటారు అందుకే చేస్తున్నాడని మరొకరు నెగెటివ్ కామెంట్స్ చేయగా…కొందరు నెటిజన్లు మాత్రం ‘దాంట్లో తప్పేముందని, అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఇది వృత్తిపరమైన నిర్ణయం’ అని నాగ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మూడో సీజన్ మరింత స్పెషల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. జూలై చివర్లో మొదలు కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
నాగ్‌ను ఏసుకుంటున్న నెటిజన్లు
Related tags :