తానా 22వ మహాసభల సందర్భంగా నిర్వహించిన తానా వాలీబాల్, త్రోబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. వర్జీనియాలోని ఛాంటిలీ నగరంలో కాసరనేని రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతిని సనత్ నేతృత్వంలోని షో స్టాపర్స్ టీమ్, ద్వితీయ బహుమతిని వెంకీ సారథ్యంలోని కంట్రీ ఓవెన్ కింగ్స్ గెలుచుకుంది. త్రోబాల్ పోటీల్లో మొదటి బహుమతిని ప్రీతి నేతృత్వంలోని రాయల్ థండర్స్ టీమ్, ద్వితీయ బహుమతిని లక్ష్మీ సారధ్యంలోని సన్రైజర్స్ టీమ్, తృతీయ బహుమతిని భవ్య సారథిగా వ్యవహరించిన సూపర్ 7 టీమ్ గెలుచుకుంది. విజేతలను తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మహాసభల సమన్వయకర్త మూల్పూరి వెంకటరావు, చైర్మన్ కొడాలి నరేన్, కోయా రమాకాంత్ తదితరులు అభినందించారు. సురేంద్ర, సువీర్, అమర్, సతీష్, మూర్తి, దినకర్, సుధీర్, సుశాంత్, కౌశిక్, రవి, అభిలాష్, పవన్, రాజేష్ తదితరులు పోటీల నిర్వహణకు తోడ్పడ్డారు.
తానా 2019 వాలీబాల్ త్రోబాల్ విజేతలు వీరే
Related tags :