నీళ్ల బాటిళ్లు కొనుక్కోవడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అదే ప్రకృతి పాలిటా మన పాలిటా శాపం కూడా అవుతోంది. అవునుమరి, ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయి నేలా నీరూ ఆ వ్యర్థాలతో నిండిపోతోంది. అవేమో వందల సంవత్సరాల వరకూ భూమిలో కరగవు. దాంతో విపరీతమైన కాలుష్యం. మరోవైపు లెగ్గింగ్‌లు ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవిలేని అమ్మాయిల వార్డ్‌రోబ్‌లు దాదాపు ఉండవేమో. అందుకే, గర్ల్‌ఫ్రెండ్ కలెక్టివ్, టీకి, యోగాడెమొక్రసీ…లాంటి కొన్ని కంపెనీలు వాడేసిన నీళ్ల బాటిళ్లను సేకరించి రీసైకిల్ చేసి లెగ్గింగ్‌లను తయారుచేస్తున్నాయి. గర్ల్‌ఫ్రెండ్ కలెక్టివ్ లెగ్గింగ్‌లు ఒక్కోటి తయారుచెయ్యడానికి సుమారు 25 వాటర్ బాటిళ్లు పడుతున్నాయట. ఇలా పర్యావరణానికి మేలు చెయ్యడంతో పాటు సౌకర్యంగానూ ఫ్యాషన్‌బుల్‌గానూ రూపొందిస్తున్న లెగ్గింగ్‌లు యువత మనసునూ దోచేస్తున్నాయి. ప్లాస్టిక్‌తో లెగ్గింగ్‌లంటే ఆశ్చర్యంగా ఉంది కదూ…
మీ లెగ్గింగ్ వచ్చింది ఓ ప్లాస్టిక్ బాటిల్ నుండి
Related tags :