రెండు పరాజయాలు ప్రపంచ కప్ నుంచి తమని తప్పించలేని ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ బెన్ స్తోక్స్ తెలిపాడు. ఇది తమ ప్రపంచ కప్ అని ధీమా వ్యక్త చేసాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓటమి నుంచి ఇంగ్లాండ్ గట్టెక్కించడానికి ఒంటరి పోరాటం చేసిన స్తోక్స్ మిచెల్ స్టార్క్ అద్భుత యార్కర్ కు క్లీన్ బౌల్డ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో బ్యాట్ ను తన్ని తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఓటమి అనంతరం మాట్లాడుతూ ఇది మా ప్రపంచ కప్ గత నాలుగేళ్ళుగా మాకు లభించిన మద్దతు వెలకట్టలేనిది. ప్రపంచకప్ ఎంత కీలకమో మాకు తెలుసు క్రికెట్ లోనే ఇదో అద్భుత సమయం. ఈ మెగా టోర్నీకి దేశం తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. వెనకడుగేసే ముచ్చటే లేదు. ఇది మా ప్రపంచ కప్. ఎలాగైనా సాధిస్తాం. గెల్పు కోసం ఒంటరిగా పోరాడినా ఫలితం తిరుగుండదు తదుపరి మ్యాచ్ లపై సరైన ప్రణాళికలు రచిస్తాం. గత రెండు మ్యాచ్ లలో మా ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. ఇంగ్లాండ్ లో మాకు భారత్ పై మంచి రికార్డు ఉంది. కానీ మేం మా అవకాశం కోసం ఎదురు చూస్తాం. బలమైన జట్టును డీ కొంటున్నప్పుడు మన సాయశాక్తులు ప్రదర్శన కనబరచాలి. మేం మా శక్తి మేరకు పోరాడుతాం అని స్తోక్స్ చెప్పుకొచ్చాడు.
రెండు ఓటములు మా గెలుపును ఆపలేవు
Related tags :