NRI-NRT

చికాగో ప్రవాసుల వనభోజనాలు

Chicago Andhra Association CAA Enjoys Summer Picnic

చికాగో ఆంధ్రా అసోసియేషన్‌(సీఏఏ) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన ఆంధ్ర వంటకాలతో ఆట పాటలతో కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బారింగ్టన్ రోడ్ పాండ్ పిక్నిక్ గ్రోవ్‌లో నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యారు. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతామని సీఏఏ సభ్యులు పేర్కొన్నారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు.