DailyDose

ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్-వాణిజ్య-06/26

Daily Business News - RBI Delivers Good News - June 26 2019

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఆన్‌లైన్‌లో పిర్యాదు చేసేందుకు వీలుగా ఒక అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. దీనిపేరు కార్పొరేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్). ఇందుకోసం ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఎడమవైపున కరెంట్ రేట్స్ కింద ఒక విండో కనిపిస్తుంది. దీనిపై ఆర్‌బీఐ లోగో ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కస్టమర్లు ఏ బ్యాంకుకు చెందిన వారైనాసరే ఫిర్యాదు చేసే వీలుంది. ఫిర్యాదు చేసిన తర్వాత అప్‌డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే ఈ లింక్ https://cms.rbi.org.in/cmc/indexPage.aspx?aspxerrorpath=/cms/indexpage.aspx సాయంతో డైరక్ట్‌గా ఫిర్యాదు చేయవచ్చు.
* ఆయిల్ నుంచి టెలికాం వ్యాపారాల వరకు విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌‌‌‌ఐఎల్) విదేశాల నుంచి అప్పు తెచ్చుకుంది. విదేశీ లెండర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుని లాంగ్ టర్మ్ లోన్స్ కింద రూ.12,900 కోట్ల అప్పు తెచ్చుకున్నట్టు ఆర్‌‌‌‌ఐఎల్ వెల్లడించింది. ఈ మొత్తాన్ని మూలధన ఖర్చుల కోసం వినియోగించనున్నట్టు తెలిపింది. టెలికాం యూనిట్ జియోకి రూ.20 వేల కోట్లను అందించనున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో కంపెనీ ఈ నిధులను సేకరించింది. భవిష్యత్తులో బ్రాడ్‌‌బ్యాండ్, ఈకామర్స్, 5జీ మొబైల్ టెలిఫోన్‌‌ సర్వీసుల్లోకి ఎంటర్‌‌‌‌ కావడం కోసం జియోకు రూ.20వేల కోట్లు ఆర్‌‌‌‌ఐఎల్ ఇస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
*ఆగని పసిడి పరుగులు..! – అంతర్జాతీయ మార్కెట్‌లో 1,442 డాలర్ల స్థాయికి
అంతర్జాతీయ మార్కెట్‌ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌– నైమెక్స్‌లో బంగారం ధర పరుగులు పెడుతోంది. మంగళవారం ఒక దశలో ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,442.15 డాలర్లను తాకింది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. ఈ వార్త రాసే సమయం– రాత్రి 10.30కి 1,428 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. వారం క్రితం పసిడి 1,350 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అంటే గరిష్టాన్ని చూస్తే, వారం రోజుల్లో దాదాపు 92 డాలర్లు పెరిగిందన్నమాట.
1.కారణాలు చూస్తే…
కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధమేఘాలు సహా కొన్ని దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణం. ప్రపంచ వృద్ధిపై ప్రత్యేకించి అమెరికా వృద్ధి స్పీడ్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు, దీనితో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 2.25–2.50 శ్రేణి) సమీపకాలంలోనే పావుశాతం తగ్గే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు, దీనితో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత (95.50) కూడా పసిడి ధరలను ఎగదోస్తున్నాయి.
2.భారత్‌లోనూ దూకుడే…
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో భారత్‌లోనూ పసిడి పరుగులు పెడుతోంది. ఢిల్లీ స్పాట్‌మార్కెట్‌లో 10 గ్రాముల ధర(24 క్యారెట్లు) రూ.470 పెరిగి, రూ.35,330కి చేరింది. దేశ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ధర రాత్రి 10.30 గంటల సమయంలో 10 గ్రాముల ధర రూ.134 పెరిగి రూ.34,575 వద్ద ట్రేడవుతోంది.
*దేశీయంగా అల్యూమినియం క్యాన్ల వినియోగాన్ని పెంచేందుకు హిందాల్కో ఇండస్ట్రీస్, బాల్బెవరేజెస్ ప్యాకేజింగ్ (ఇండియా), క్యాన్-ప్యాక్ ఇండియా చేతులు కలిపాయి.
*విశాకా ఇండస్ట్రీస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘వీనెక్స్ట్’ బోర్డుల తయారీకి తమిళనాడులో కొత్త యూనిట్ నిర్మించనుంది. దీనిపై రూ.100 కోట్ల పెట్టుబడి పెడతారు.
* బీఎస్-6 ఉద్గార నిబంధనలకు మారాక కుదురుకోవడానికి సమయం పడుతుందని జపాన్కు చెందిన వాహన దిగ్గజం హోండా అభిప్రాయపడింది.
*సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడు మీలా సత్యనారాయణ (88) మంగళవారం కన్నుమూశారు.
*సూచీలు మెరిశాయి. రుతుపవనాల వేగవంతమైన పురోగతితో మదుపర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. దేశంలోని సగం ప్రాంతాల్లో వర్షాలు ఇప్పటికే మొదలైనట్లు, మధ్య, పశ్చిమ భారతంలోనూ రానున్న వారం రోజుల్లో మెరుగైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల నడుమ మార్కెట్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
*దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అమరరాజా బ్యాటరీస్లో వాటాదారుగా ఉన్న జాన్సన్ కంట్రోల్స్ తన వాటా విక్రయించింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న పాంథర్ ఏఆర్బీఎల్ ఎల్ఎల్పీ అనే పెట్టుబడి సంస్థకు తన షేర్లు బదిలీ చేసింది.
*విరాల్ ఆచార్య వైదొలగడంతో ఆయన స్థానంలో ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నరును నియమించేందుకు ప్రభుత్వం అన్వేషణ ప్రారంభించనుంది. పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే ఆచార్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.