DailyDose

ఏపీ కేబినెట్లో సంపన్నుడు జగన్-రాజకీయ-06/26

Daily Political News - YS Jagan Is Richest In AP Cabinet - June 26 2019

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత సంపన్నుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) వెల్లడించింది. రాష్ట్ర మంత్రివర్గంలోని 26 మంది ఇటీవల ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణ పత్రాలను పరిశీలించిన ఆ సంస్థ మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం… రూ.510 కోట్ల ఆస్తులతో ముఖ్యమంత్రి అందరికంటే ముందుండగా, ఆ తర్వాతి స్థానాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రూ.130 కోట్లు), మేకపాటి గౌతంరెడ్డి (రూ.61 కోట్లు) ఉన్నారు. 26 మంది మంత్రుల్లో 23 మంది (88%) కోటీశ్వరులే. మంత్రుల సగటు ఆస్తి విలువ రూ.35.25 కోట్లు. మంత్రివర్గంలో 17మంది (65%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంలో 9 మంది (35%)పై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. అందరికంటే అధికంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రూ.20 కోట్ల రుణం ఉంది. చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రూ.12 కోట్లు, ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావుకు రూ.5 కోట్ల అప్పులున్నాయి.
* రాజశేఖర్ పొరపాటున నన్ను చేసుకున్నారు.- జీవిత
ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని అని ఓ సినీ గేయ రచయితా చెప్పినట్లు ఎవరితో ఎవరికీ రాసి పెట్టి ఉంటె వారితోనే పెళ్ళిళ్ళు అవుతాయంటారు పెద్దలు. అది అక్షరాలా నిజమేనేమో. టాలీవుడ్ మోస్ట్ ఫేవరబుల్ జంట జీవిత రాజశేఖర్ ల ప్రేమ పెళ్లి కధలో కూడా సినిమాను తలపించే ట్విస్ట్ ఉంది. వారి జీవితంలోని ఆసక్తికర సంగతులను జీవిత అప్పట్లో ఓ యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. పెళ్ళికి ముందే నేను, రాజశేఖర్ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. షూటింగుల నిమిత్తంగా వేర్వేరు రూముల కేటాయించినా ఒకే రూములో ఉండేవాళ్ళం. అయినా ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మా రిలేషన్ చిప్ గురించి మా అమ్మానాన్న చాలా కంగారు పడేవాళ్ళు. ఒకవేళ పెళ్లి చేసుకోనంటే ఎం చేస్తావనే వారు. ఆయనకీ ఓ మంచి స్నేహితురల్లనే ఉండిపోతాననే దాన్ని కానీ పెళ్లి చేసుకోకలేకపోయానని ఎప్పుడూ బాధపడానని చెప్పేదాన్ని. అనుకున్నట్టుగానే ఆయనకీ ఇండస్ట్రీలో మాయితో వివాహం నిశ్చయమైంది అయితే ఆమె హీరోయిన్ మాత్రం కాదు. రాజశేఖర్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాటకి తలోగ్గారు. ఆ అమ్మాయిని నాకు పరిచయం చేశారు రాజశేఖర్. ఆమె నాతోనే చదువుకుంది నాకు సీనియర్ ఆరోజు ముగ్గురం కలిసి గుడికి వెళ్ళాం. ముందు సీట్లో ఆయన, తను ఎప్పుడూ ఆయన పక్కన కూర్చొనే నేను ఆరోజు వెనుక సీట్లో కూర్చున్నాను. ఆరోజు ముగ్గురం బాగానే మాట్లాడుకున్నాం. గుడిలో దేవుడి దర్శనం అయ్యాక ఎవరి ఇల్లకూ వాళ్ళం వెళ్ళిపోయాం. ఆతరువాత కూడా మా ఇద్దరి సినిమాలు వచ్చేవి. పెళ్లి నిస్చయమవడంతో రాజశేఖర్ ని చేసుకోబోయే ఆవిడ నాతొ రిలేషన్ షిప్ కట్ చేయమని చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. ససేమీతా నాతొ స్నేహాన్ని వదులుకోనని చెప్పారట. అదే విషయాన్నీ నాతొ చెప్పారు. మీఇష్టం..మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి అన్నానునేను. అనంతరం పరిణామాల తరువాత ఆమెతో రాజశేఖర్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆతరువాత కూడా మూడు సినిమాలు కలిసి చేశాము. మగడు సినిమా చేస్తున్న సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయింది. నేలన్నత పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. ఆయనతో పాటు నేను కూడా హాస్పిటల్ లోనే ఉన్నాను. ఆతరువాత రాజశేఖర్ గారి తల్లిదండ్రులు మనసు మార్చుకుని ఆయన డిశ్చార్జి అయిన తరువాత నన్ను కూడా నేరుగా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళారు. మా పెళ్ళికి పచ్చజెండా ఊపారు. యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి ఆయనకీ ఏడాది పట్టింది. అప్పుడు పెళ్లి చేసుకుందాం అనేసరికి మానాన్న గారు చనిపోయారు. మళ్ళీ ఇంకో ఏడాది ఆగి పెళ్లి చేసుకున్నాము అని చెప్పుకొచ్చారు జీవిత వారి ప్రేమా, పెళ్లి ముచ్చట్లను.
* పోలవరం పూర్తీ చేస్తాం- కేంద్రమంత్రి జావడేకర్
ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భారం మొత్తం కేంద్రప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను రెండేళ్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు. దీంతో పోలవరం నిర్మాణ పనులు ఎలంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయన్నారు. స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేయాలని చూశామని, కానీ కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉండడం వలన అది కుదరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రమే చూసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
*అధికారిని బ్యాటుతో కొట్టిన ఎమ్మెల్యే – ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించాడో ఎమ్మెల్యే. ప్రభుత్వాధికారిని కొడుతూ దురంహకారం ప్రదర్శించాడు.
వివరాలు.. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఓ మున్సిపల్‌ ఉద్యోగి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వార్గియా ఆయనతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయి సదరు అధికారిని కొట్టడం ప్రారంభించారు. అక్కడున్న వాళ్లు వారించినా వినకుండా క్రికెట్‌ బ్యాట్‌తో చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.కాగా ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో బీజేపీ నేత హితేశ్‌ బాజ్‌పాయ్‌ రంగంలోకి దిగారు. ప్రభుత్వ అధికారి విజయ్‌ను లంచం అడిగినందుకే ఆయన ఇలా ప్రవర్తించారని వెనకేసుకొచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని.. లంచగొండులను సహించేది లేదని తేల్చిచెప్పారు. కావాలంటే ఆకాశ్‌ను అరెస్టు చేయవచ్చని.. అయితే అంతకంటే ముందు లంచం అడిగిన అధికారిని జైళ్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు.
* ఏపీలో బీహార్ తరహా పాలన – లోకేష్
సీఎం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోందిటీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారుటీడీపీకి మెజార్టీ వచ్చిన గ్రామాల్లో గోడలు కడుతున్నారు.ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదుఇప్పటి వరకు ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేసారు130 కార్యకర్తల పై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసారుమేము సంయమనంతో ఉన్నాం.అయినా కావాలని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారుహత్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు కార్యకర్తలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది రాజకీయ హత్యలు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు ? రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి 2004 లో వైయస్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఇలానే టిడిపి కార్యకర్తలను హత్య చేసార-తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొం, పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటుంది
* రాజ్యసభ వేదికగా కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోదీ.
వీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజాతీర్పును అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటమిని జీర్ణించుకోలేకనే ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ ఓడిపోతే.. ప్రజాస్వామ్యం పరాజయం చెందిందని కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాతీర్పును గౌరవించడం కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు.పూర్తి మెజార్టీతో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిందని, ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటూ తమను ఎన్నుకున్నారన్నారు మోదీ. కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక ఈవీఎంలపై నిందలు మోపుతున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి కేవలం రెండు సీట్లే వచ్చినప్పుడు చాలా మంది నవ్వారని, కానీ కష్టపడి.. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలుపొందామన్నారు. అంతేకాని పోలింగ్ కేంద్రాలపై నిందలు మోపలేదని ప్రధాని అన్నారు.
* సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు కామెంట్స.
ప్రభుత్వం అక్రమ కట్టడాలు కూల్చివేత మంచిదే కానీ అది ప్రజావేదికతో నిలిచిపోకూడదుప్రజావేదిక కూల్చి మిగిలిన వనాలను వదిలేస్తే అది కక్ష పూరిత చర్యే అవుతుందికృష్ణానదిని పరివాహక ప్రాంతంలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయిటీడీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో వీటి నిర్మాణం పెరిగిందిఅక్రమ కట్టడాలు కూల్చివేతపై కూడా ఏపీలో రాజకీయం చేయడం దురదృష్టం
* కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి కామెంట్స్
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు నేతల పై జరుగుతున్న దాడులను హత్యలను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు…
పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో ముగిసిన చంద్రబాబు సమావేశంటీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నాయిఈ విషయాన్న డిజిపి ని కలసి పిర్యాదు చేయాలని బావిస్తున్నాంప్రజా వేదిక కూల్చివేత అనేది ఎవరిపైన జగన్ కక్ష తీర్చుకుంటున్నారు అది ప్రజల సోమవముతో నిర్మించిన వేదిక..జగన్ బయపట్టేరితిలో పాలన చేయాలని చూస్తున్నాడు.కక్షపూరితంగా నే ప్రజా వేదిక ను కొలుస్తున్నారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమావేశాలు నిర్వహిస్తాంప్రజలను చైతన్య పరిచి జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత పాలన తెలియచేస్తాం..
* 2023లో తెలంగాణ భాజపాదే: శివరాజ్‌సింగ్‌
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో భాజపా ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. భాజపాకు మద్దతు పలికినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల వారినీ భాజపాలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. జులై 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారన్నారు. జులై 7 నుంచి ఆగస్టు 11 వరకు సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు కాలం చెల్లిందన్న ఆయన.. కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధిపై ధ్యాస లేదని విమర్శించారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. పార్టీ విస్తరణలో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భాజపా జాతీయ నేతలంతా తెలంగాణ, బెంగాల్‌పై దృష్టి సారించారన్నారు.
* వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు – మోదీ
లోక్ సభలో మాటల తూటాలు పేల్చారు ప్రధాని మోదీ. పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను కడిగిపారేశారు. గొప్పవాళ్లను గౌరవించే సంప్రదాయం ఆ పార్టీలో లేదంటూ ఫైరయ్యారు. పీవీ, మన్మోహన్ లకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని పెద్ద జైలుగా మార్చిందని విమర్శించారు.రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అప్పగించినందుకు ప్రజలు మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల, మహాపురుషుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష సభ్యులు చేసిన సలహాలను స్వీకరిస్తామని చెప్పారు మోదీ. కాంగ్రెస్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మోదీ. దేశానికి వాజ్ పేయ్ చాలా మంచి పాలన అందించారని గుర్తుచేశారు.
* అలా అయితే టీఆర్‌ఎస్‌లో చేరేవాడిని – రాజగోపాల్
తెలంగాణ ప్రస్తుత నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అందుకే తాను పార్టీ మారే నిర్ణయం తీసుకున్నాను అన్నారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌ కారణంగా పార్టీ అధ్వానంగా తయారైందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై పోరాడే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందంటున్నారు రాజగోపాల్‌. స్వలాభం చూసుకునేవాడిని అయితే టిఆర్‌ఎస్‌లో చేరేవాడిని అన్నారు రాజగోపాల్.
* ఏపీ ప్రజలపై పవన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోవడానికి ప్రజల్లో పోరాడే తత్వం లేకపోవడమే కారణం అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకు ఉన్న పట్టుదల.. ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాడితే.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలు మాత్రం అలాంటి పోరాటం చేయలేకపోతున్నారన్నారు.ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుంచి సరైన నిరసన రాలేదన్నారు పవన్‌. ప్రజల నుంచి బలమైన నిరసన రానంత వరకు హోదా విషయంలో తామేమి చేయలేమన్నారు. పవన్‌ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రత్యేక హోదా పోరాటం నుంచి తప్పుకునేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.
* చంద్రబాబును వదిలిపెట్టను: ఆళ్ల
ప్రజావేదిక కూల్చివేతపై సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజావేదిక కూల్చివేత పనులను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయని, వాటన్నిటికీ నోటీసులు ఇప్పించినట్లు తెలిపారు. ఈనెల 21న దీనికి సంబంధించిన కేసులు న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉండగా.. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేశారని ఆరోపించారు. ప్రజావేదిక పక్కన ఉన్న ఇంట్లో చంద్రబాబు ఉండటం అన్యాయమని, ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా తక్షణమే ఖాళీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబును తాను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మిగిలిన వాళ్లు తామంతట తాము ఖాళీ చేస్తే మంచిదని, జగన్‌కి ఉన్న మంచి మనసును అంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
* వచ్చే నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 11 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11న సమావేశాలు ప్రారంభించి.. 12న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాలే ప్రధాన ఎజెండాగా బడ్జెట్ ఉండనుందని సమాచారం. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా జూలై 1, 2 తేదీలలో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్ని శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు.
* ఆర్టీసీ విలీనంపై జగన్‌ సమీక్ష
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అధ్యయన ప్రక్రియ ఇవాళ ప్రారంభం అయ్యింది. ఈ అంశంపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నానితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించిన కమిటీని ఈనెల 14న నియమించింది. ఆర్టీసీ పూర్వ ఎండీ, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి సి.ఆంజనేయరెడ్డి నేతృత్వంలో మరో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. సభ్యులుగా ట్రాన్స్‌పోర్టు విభాగం ముఖ్య కార్యదర్శి టి.కృష్ణబాబు, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు పూర్వ డైరెక్టర్‌ సుదర్శనం పాదమ్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.వి.వి సత్యనారాయణ, ఆర్టీసీ ఈడీ (అడ్మిన్‌) కోటేశ్వరరావు ఉన్నారు.
*భారత ఆత్మను ఛిద్రం చేశారు
లోక్సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపైన.. ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు. పదునైన పదజాలం, ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత తొలిసారి లోక్సభలో మాట్లాడిన ఆయన.. దాదాపు గంటపాటు నిశిత విమర్శలు గుప్పించారు. అత్యయిక పరిస్థితి విధించి భారతదేశపు ఆత్మను కాంగ్రెస్ పార్టీ ఛిద్రం చేసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చీకటి రోజులను ఏనాటికీ మర్చిపోలేమన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు తప్ప వేరెవ్వరి కృషినీ కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని మండిపడ్డారు.
*విత్తన భాండాగారంగా రాష్ట్రం
తెలంగాణ విత్తన రంగానికి మహర్దశ పట్టనుందని.. ప్రపంచ విత్తన భాండాగారంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నుంచి హైటెక్స్లో ప్రారంభమవుతున్న అంతర్జాతీయ విత్తన సదస్సుకు పలు దేశాల నుంచి నిపుణులు హాజరవుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా), రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సు వల్ల తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
*తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కిషన్రెడ్డి విందు
తెలుగు రాష్ట్రాల నుంచి లోక్సభకు ఎన్నికైన సభ్యులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి మంగళవారం రాత్రి విందు ఇచ్చారు. భాజపా నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిధున్రెడ్డి, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, లోక్సభ పక్ష నేత రామ్మోహన్నాయుడు, కాంగ్రెస్ నుంచి రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావుతో ఆయా పార్టీల ఎంపీలంతా పాల్గొన్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, వ్యక్తిగత పనుల వలన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కేంద్ర మంత్రులు తమ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారితో సత్సంబంధాలు కొనసాగించాలని భాజపా అధిష్ఠానం ఇచ్చిన ఆదేశం మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా పాల్గొన్నారు.
*పార్టీ మారడం ఖాయం
నూటికి నూరు శాతం పార్టీ మారడం ఖాయమని.. ఎప్పుడు.. ఏవిధంగా ఎలా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారితే వచ్చే న్యాయ, సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తనను భాజపాలోకి ఆహ్వానించారని… భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్తోనూ తాను సమావేశమైనట్లు తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.
*ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యతలు
తెలంగాణ రాష్ట్రసమితి ఈనెల 27 నుంచి ప్రారంభించనున్న సభ్యత్వ నమోదులో నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని జరిపించాలని భావిస్తోంది. ఇందుకు ఎమ్మెల్యేలను కీలకంగా పార్టీ భావిస్తోంది. సభ్యత్వ నమోదును భారీఎత్తున నిర్వహించాలని, కోటి మందిని చేర్పించాలని తెరాస ప్రణాళిక రూపొందించింది.
*వైఎస్ హయాంలోనే అక్రమ నిర్మాణాలు
ప్రభుత్వ స్థలంలో ప్రజాధనంతో ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టడం అవివేకమైన చర్యగా తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు, సమావేశాల నిర్వహణ కోసం కట్టుకున్న భవనాన్ని కూల్చడం మంచి నిర్ణయం కాదన్నారు. రాజధాని ప్రాంతంలోని కరకట్ట లోపలి భాగంలో నిర్మించిన చాలా భవనాలు వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా, మల్లాది విష్ణు ఉడా ఛైర్మన్గా ఉన్నప్పుడు నిర్మించినవే అని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తదితరులు మంగళవారం భేటీ అయ్యారు. .
*బీసీలకే పీసీసీ బాధ్యతలు ఇవ్వాలి: వీహెచ్
మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నవారికి, అందులోనూ బీసీలకే ఈసారి పీసీసీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులుండి ఏం చేశారని ప్రశ్నించారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిని మార్చేదిలేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా చెబుతుంటే.. జగ్గారెడ్డి తనకు పీసీసీ పదవి ఇవ్వాలని ఎలా అడుగుతారన్నారు.కాంగ్రెస్కు జగ్గారెడ్డి విధేయుడో కాదో తనకు తెలియదన్నారు. పార్టీలో తనకంటే విధేయులు ఎవరున్నారని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉన్న వారికే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు.
*రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసి భాజపాలో చేరాలి: మల్లు రవి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. పార్టీలో అనేక పదవులు అనుభవించిన రాజగోపాల్రెడ్డికి.. మాట్లాడే హక్కు లేదన్నారు
*భాజపా నేతలవి విచిత్ర విన్యాసాలు: ఎమ్మెల్సీ కర్నె
భాజపా రాష్ట్ర నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ, విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణలో జరిగే ప్రతి చిన్న విషయానికి వారు మతం రంగు పులిమేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆదిలాబాద్ లాంటి ప్రశాంతమైన జిల్లాలోనూ ఎంపీ సోయం బాపురావు.. వర్గాల మద్య కొట్లాట పెడుతున్నారని దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
*కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులను పరిశీలిస్తాం: చాడ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ వ్యయంపై ఇంజినీర్లతో మాట్లాడి పరిశీలిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ నిర్మాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గోదావరి నీళ్ల సద్వినియోగం కోసం నలభై ఏళ్లుగా ఉద్యమించింది సీపీఐ పార్టీయేనని పేర్కొన్నారు. కాళేశ్వరం కలల ప్రాజెక్టుతోపాటు ఖర్చుతో కూడుకున్నదన్నారు.