Food

నూడుల్స్ సమోసాలో కూరితే….

Have you ever made or tried noodles samosa?

కావలసినవి:
మైదాపిండి: పావుకిలో, వాము: అరటీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, నీళ్లు: తగినన్ని, అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను, బీన్స్‌ముక్కలు: 2 టేబుల్‌స్పూన్లు, క్యారెట్‌ముక్కలు: 2 టేబుల్‌స్పూన్లు, క్యాబేజీ తురుము: పావుకప్పు, క్యాప్సికమ్‌ముక్కలు: టేబుల్‌స్పూను, రెడ్‌చిల్లీసాస్‌: టీస్పూను, సోయాసాస్‌: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లికాడలతురుము: 2 టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌: టీస్పూను, ఉడికించిన నూడుల్స్‌: 2 కప్పులు

తయారుచేసే విధానం:
* బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత చిటికెడు ఉప్పు వేసి కలపాలి. బీన్స్‌ముక్కలు, క్యారెట్‌ముక్కలు, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్‌ ముక్కలు, రెడ్‌చిల్లీసాస్‌, సోయాసాస్‌ వేసి కలపాలి. తరవాత ఉల్లికాడల తురుము కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్‌ చల్లినట్లుగా వేసి ఉడికించిన నూడుల్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ చిల్లుల ప్లేటులో వేసి ఆరనివ్వాలి.

* ఓ గిన్నెలో మైదాపిండి, వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తరవాత కొంచెంకొంచెంగా నీళ్లు పోసి ముద్దలా కలిపి మూతపెట్టి కాసేపు నాననివ్వాలి. తరవాత పిండిని చిన్నముద్దల్లా చేసి పూరీల్లా వత్తాలి. దీన్ని సగానికి కోసి ఒక్కో సగాన్నీ త్రికోణాకారంలో చుట్టి అందులో నూడుల్స్‌ మిశ్రమాన్ని పెట్టి అతికించాలి. ఇలాగే అన్నీ చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.