Movies

ప్రియమైన పాటలు

Priya Prakash Varrier Becomes Singer In Her New Movie

ఇలా కన్ను గీటి అలా కుర్రకారును తనవైపు తిప్పుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఆమెలో మంచి నటే కాదు గాయని కూడా ఉన్నారు. క్రీడా నేపథ్యంతో తెరకెక్కిస్తున్న ఓ మలయాళ సినిమా కోసం ఆమె తొలిసారి పాట పాడారు. గాయకుడు నరేశ్‌ ఐయ్యర్‌తో కలిసి ఆమె ఈ పాటను ఆలపించారు. కైలాష్‌ మేనన్‌ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీరేఖ భాస్కరన్‌ సాహిత్యం సమకూర్చారు. ఈ పాటకు సంబంధించిన టీజర్‌ను ప్రియా వారియర్‌ సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘నా తొలి ప్రయత్నాన్ని మెచ్చుకున్న మీకంతా నా ధన్యవాదాలు’ అని ఆనందం వ్యక్తం చేశారు.ప్రియా వారియర్‌ తెలుగులోనూ నేరుగా సినిమా చేస్తున్నారు. నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రంగ్‌దే’లో ఆమె నటించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి ప్రియా వారియర్‌ కూడా హజరయ్యారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్‌ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క ప్రియా వారియర్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ విడుదలకు సిద్ధమౌతోంది.