పాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయనేది అందరికీ తెలిసిందే. వాటిని అప్పుడప్పుడూ చర్మసంరక్షణకూ ఉపయోగించి చూడండి. మెరిసే మేనిఛాయ మీ సొంతం అవుతుంది.
* చాలామంది మహిళలు ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోరు. ఎండ పడిన చోట చర్మం కమిలిపోయి నల్లగా, ఎర్రగా మారుతుంది. ఈ సమస్యకు పాల మాస్క్‌ని వేసి చూడండి. శుభ్రమైన తెల్లటి, పల్చటి కాటన్ వస్త్రాన్ని పాలల్లో ముంచండి. ఆ వస్త్రాన్ని ముఖంపై పరిచి, అయిదు నిమిషాలు అదిమిపెట్టాలి. చర్మం శుభ్రపడటమే కాదు, నలుపు సమస్యా కొంతవరకూ అదుపులోకి వస్తుంది.
* బొప్పాయి ముక్కలు, పాలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై పేరుకున్న నలుపు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతిమంతంగా మారుతుంది.
* పాలతో ముఖానికి వేసుకున్న అలంకరణనూ తొలగించొచ్చు. పాలలో దూది ఉండను ముంచి ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. అలంకరణతోపాటు, చర్మంలోని మలినాలూ పోతాయి.
* రెండు మూడు చెంచాల పాలలో కాసిని దానిమ్మగింజలు వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి… నాలుగైదు నిమిషాలు మర్దన చేయాలి. కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. పెదాల నలుపుదనం తగ్గిపోయి సహజ ఎరుపు రంగులోకి వస్తాయి. పొడిబారకుండానూ ఉంటాయి.
సన్‌స్క్రీన్ రసాయనాల బదులు పాలు వాడి చూడండి
Related tags :