గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం జగన్ దృష్టి సారించారు. విద్యుత్, ఇంధనశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సోలార్, పవన విద్యుత్ కొనుగోళ్లపై ఆయన విస్తృతంగా చర్చించారు. బిడ్డింగ్ ధరల కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేశారని అధికారులను సీఎం ప్రశ్నించారు. ఈ అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,636 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ డబ్బును రికవరీ చేయాలని జగన్ ఆదేశించారు. సోలార్, పవన్ విద్యుత్ సంస్థలతో తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ఓ కమిటీని సీఎం ఏర్పాటు చేశారు. సౌర, పవన విద్యుత్ సంస్థలు దారికి రాకపోతే ఒప్పందాలు రద్దు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, సీఎంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని.. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై విద్యుత్ ఒప్పందాలు పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ మేరకు మొత్తం 30అంశాలపై విచారణ చేస్తామని జగన్ స్పష్టంచేశారు.
తెదేపా విద్యుత్ ఒప్పందాలపై దర్యాప్తు
Related tags :