* రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై 1100కి ఫిర్యాదు చెయ్యాలని వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పర్మిషన్ లేని విగ్రహాలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా చెరువుల్లో నివాసాలు వున్నాయని, నివసిస్తున్న వారిని గుర్తించి వారికి నివాసం వుందో లేదో చూసి వారికి నివాసాలు ఏర్పాటు చెయ్యాలని కోరారు.ప్రజలు చెరువులు ఖాళీ చెయ్యాలని కోరారు.రోడ్డుపై ఆక్రమణలు ఉన్నా చర్యలు చేపట్టాలని కోరారు
* గుత్తిలో గుంతకల్లు ఎమ్మెల్యేకి చుక్కెదురు
అనంతపురం జిల్లా గుత్తి లో గుంతకల్లు ఎమ్మెల్యే వెంట్రామిరెడ్డికి రైతుల నుంచి చుక్కెదురు. రైతులకు సబ్సీడి విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వ అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వేరుశనగ విత్తనాల పంపణీ ప్రారంభించడానికి వచ్చిన ఆయనను వర్షాలు కురుస్తున్నా విత్తనాలు మాత్రం అందడంలేని రైతులు నిలదీశారు. దీంతో కాసేపు ఎమ్మెల్యేకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులతో మాట్లాడిన వెంట్రామిరెడ్డి నాలుగైదు రోజుల్లో రైతులందరికి విత్తనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులు శాంతించడంతో విత్తన పంపిణీని ప్రారంభించి వెళ్లారు ఎమ్మెల్యే.
* బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు కీలక పదవి
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కు కీలక పదవి దక్కింది. ఆ పార్టీ లోక్ సభా పక్ష ఉపనేతగా ఆయన నియమితులయ్యారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి లు ఆయనను ఈ పదవిలో నియమించారు. అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులును పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నియమించింది వైసీపీ. కాగా ఈ ఎన్నికల్లో బాపట్ల లోక్ సభ స్థానం నుంచి టీడీపీ నేత శ్రీరామ్ మాల్యాద్రిపై నందిగం సురేష్ గెలుపొందారు. అలాగే నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు పై శ్రీకృష్ణ దేవరాయలు విజయం సాధించారు.
* గెలుపోటములు సహజం.. కార్యక్షేత్రంలోకి దిగాలి: నారా భువనేశ్వరి…..
ప్రజావేదిక కూల్చివేతతో పాటు టీడీపీ నేతలపై దాడులు.. తమ కుటుంబసభ్యులకు భద్రతను కుదించడం తదితర విషయాలపై స్పందించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో కామన్ లా అడ్మిషన్ టెస్టులో ర్యాంకులు సాధించిన విద్యార్ధులను గురువారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ… జీవితంలో గెలుపోటములు సహజమని ఆమె వ్యాఖ్యానించారు.2015లో 88 మంది బాలికలతో ఎన్టీఆర్ కాలేజీని స్థాపించామని.. ఇప్పుడు 200 మంది బాలికలు ఈ కాలేజీలో చదువుతున్నారని పేర్కొన్నారు.సివిల్స్, న్యాయ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నామని.. వచ్చే ఏడాది ఎక్కువ ప్రతిభ కనబరిచిన విద్యార్ధికి గోల్డ్ మెడల్ ఇస్తామన్నాని ఆమె స్పష్టం చేశారు. ధైర్యంగా నిలబడి, పోరాడటం అలవర్చుకోవాలని.. కార్యక్షేత్రంలోకి దిగితేనే వాస్తవాలు తెలుస్తాయని భువనేశ్వరి తెలిపారు.
* బీజేపీలో చేరిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్.
మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్‌లు గురువారం నాడు బీజేపీలో చేరారు. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడ ఆ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.గురువారం నాడు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్ లు బీజేపీలో చేరారు. పెద్దిరెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. బోడ జనార్ధన్ గతంలో టీడీపీలో ఉండేవాడు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్ రెడ్డి కూడ బీజేపీలో చేరారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతో పలువురు ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు.
* ఇంకా నయం… తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్‌లో ఉంది కాని..: కేశినేని నాని
ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘ఇంకా నయం… తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే’… అని నాని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక అని ఆయన తెలిపారు. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన పిదప, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని కేశినేని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
* రేపు ఉప ముఖ్యమంత్రి ఏలూరు రాక
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఈనెల 28న ఏలూరు రానున్నారు. ఈనెల 29వ తేదీ శనివారం ఏలూరులో నిర్వహించే జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు ఆయన 28వ తేదీ శుక్రవారం రాత్రి ఏలూరు విచ్చేస్తున్నారు. జిల్లాలో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్య క్రమాలపై సమావేశంలో ఆయన చర్చించనున్నారు.
* కాంగ్రెస్ పార్టీది దురహంకారం
కాంగ్రెస్ పార్టీ తన దురహంకారం వల్లే ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఈవీఎంలను అనుమానిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. జమిలి ఎన్నికల విషయంలోనూ వారి తీరు ఇలాగే ఉందని.. వాళ్లకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా కనీసం చర్చకు ముందుకు రావాలని అన్నారు. లోక్‌సభలో తన మాటలతో నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ రాజ్యసభలోనూ అదే వాగ్దాటిని ప్రదర్శించారు.
* రాష్ట్ర విధ్వంసానికి నాంది: తెదేపా నేతలు
‘‘దాడుల పట్ల కార్యకర్తలు సంయమనం పాటించాలి. బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు అండగా ఉండాలి. ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా కల్పించాలి. దాడులు, దౌర్జన్యాలపై డీజీపీని కలిసి వినతిపత్రం అందించాలి’’అని ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం ఉండవల్లిలో తెదేపా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజావేదికను కూల్చేయడం ద్వారా రాష్ట్ర విధ్వంసానికి వైకాపా ప్రభుత్వం నాంది పలికిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
* జపాన్ ప్రధానితో మోడీ భేటీ
జపాన్ ప్రధాని షింజో అబే.. ప్రధాని మోదీ ఇవాళ కలుసుకున్నారు. ఒసాకాలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి అబే కంగ్రాట్స్ చెప్పారు. త్వరలోనే ఇండియాకు రానున్నట్లు జపాన్ ప్రధాని తెలిపారు. భారత్, జపాన్ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ సమావేశంపై ట్వీట్ చేశారు.
దివ్యమైన భవిష్యత్తు కోసం ఈ స్నేహం వికసిస్తుందన్నారు. కంగ్రాట్స్ చెప్పి అబేకు మోదీ థ్యాంక్స్ చెప్పారు.
* కశ్మీర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా …
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఇవాళ కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన అర్హద్ ఖాన్ ఇంటికి మంత్రి వెళ్లారు. అక్కడ ఆయన అమర పోలీసు కుటుంబసభ్యులతో మాట్లాడారు. జూన్ 12వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో ఎస్‌హెచ్‌వో అర్షద్ ఖాన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్‌నూ షా కలిశారు. ఇద్దరూ రివ్యూ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల అంశంపై సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
* ఆకస్మిక తనిఖీ …. : శాసన సభ్యులు కాసు మహేష్
పిడుగురాళ్ల మండలం కరాలపాడు హెల్త్ సెంటర్ ని ఆకస్మిక తనిఖీ చేసిన శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి గ్రామంలో డాక్టర్ ప్రభావతి అందుబాటులో ఉండటం లేదని గ్రామస్తులు చెప్పటం తో హెల్త్ సెంటర్ కి వచ్చిన mla మహేష్ రెడ్డి.
9గం,, నుండి 12 గంటల వరకు ప్రతిరోజు డాక్టర్ హాస్పిటల్ op లో అందుబాటులో ఉండాలి,లేని పక్షంలో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పిన శాసన సబ్యులు మహేష్ రెడ్డి.రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాలు సలహాదారునిగా బాధ్యతలు చేపట్టినసజ్జల రామకృష్ణ రెడ్డి
* కాంగ్రెస్ నేత విహెచ్ హౌస్ అరెస్ట్
సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తలపెట్టాయి. దీంతో గురువారం ఉదయం నుండి విపక్ష నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరో వైపు హబ్సిగూడలోని ఓ హోటల్ లో బిజెపి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయం వద్ద నిరసన చేపట్టేందుకు బిజెపి నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆ హోటల్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.
* లక్ష్మీపురం కేసీపీ కర్మాగారం మూత పడకుండా చూస్తాం :ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు…
అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఏకైక లక్ష్మీపురం లో కెసిపి కర్మాగారం మూతపడకుండా చూస్తామని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు చెప్పారు.స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో రైతు సంఘం నాయకులు మిక్కిలినేని పాపారావు,కార్మికులు,రైతులు గురువారం ఎమ్మెల్యే సింహాద్రిని కలుసుకుని కేసీపీ కర్మాగారం మూత పడకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసీపీ కర్మాగార పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి తెలియజేసి కర్మాగారం మూతపడకుండా చుస్థామన్నారు.దివిసీమలోని ఏకైక కర్మాగారం ఎట్టి పరిస్థితిలోనూ మూత పడకుండా చుస్థామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు,కార్మిక సంఘం నేతలు కొల్లూరు వెంకటేశ్వరరావు, కె.హరిబాబు,మోదుమూడి కుటుంబరావు, ఏ.ఐ.ఎఫ్.టి.యు నాయకులు సుధీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుంటూరు రాఘవులు, మాజీ సర్పంచ్ నలుకుర్తి పృథ్విరాజ్, మండల పార్టీ అధ్యక్షులు రేపల్లె శ్రీనివాసరావుతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
* త్వరితగతిన నిర్ణయాలు అమలు- ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ తన నిర్ణయాలను త్వరిత గతిన అమలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి భద్రతను చాలా వరకూ తగ్గించారు. నిన్నటికి నిన్న గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చి వేశారు. నేడు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర భద్రతను పూర్తిగా తగ్గించారు. ఏపీఎస్పీ భద్రతను ప్రభుత్వం తొలగించి వేసింది. ఆయన ఇంటి వద్ద ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో మాత్రమే భద్రతా చర్యలు చేపట్టారు. దీనిపై టీడీపీ నేతల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు కుటుంబానికి, ఇంటికి కావాలనే భద్రతను తొలగిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
* జపాన్ ప్రధానితో మోదీ భేటీ
జపాన్ ప్రధాని షింజో అబే.. ప్రధాని మోదీ ఇవాళ కలుసుకున్నారు. ఒసాకాలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి అబే కంగ్రాట్స్ చెప్పారు. త్వరలోనే ఇండియాకు రానున్నట్లు జపాన్ ప్రధాని తెలిపారు. భారత్, జపాన్ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ సమావేశంపై ట్వీట్ చేశారు. దివ్యమైన భవిష్యత్తు కోసం ఈ స్నేహం వికసిస్తుందన్నారు. కంగ్రాట్స్ చెప్పి అబేకు మోదీ థ్యాంక్స్ చెప్పారు.
* సచివాలయానికి భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయం కోసం డీ బ్లాక్ వెనుక భాగంలో పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, హోంమంత్రి మహమూద్ అలీ, హరీశ్ రావు, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
* జీవితంలో గెలుపోటములు సహజం: నారా భువనేశ్వరి
జీవితంలో గెలుపోటములు సహజమని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో కామన్ లా అడ్మిషన్ టెస్టులో ర్యాంకులు సాధించిన విద్యార్థులను భువనేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2015లో 88మంది బాలికలతో ఎన్టీఆర్ కాలేజీని స్థాపించామని, ఇప్పుడు 200మంది బాలికలు ఈ కాలేజీలో చదువుతున్నారని తెలిపారు. సివిల్స్, న్యాయ, ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారని, వచ్చే ఏడాది ఎక్కువ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి గోల్డ్‌మెడల్ ఇస్తామన్నారు. ధైర్యంగా నిలబడండి.. పోరాడటం అలవర్చుకోవాలని ఆమె సూచించారు. కార్యక్షేత్రంలోకి దిగితేనే వాస్తవాలు తెలుస్తాయని భువనేశ్వరి చెప్పారు.
* జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది: గోరంట్ల
జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడైన జగన్ నీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామ వాలంటీర్ల పేర్లతో దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.
* ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తా.. – బాలయ్య
హిందూపురం నియోజకవర్గంను జిల్లాగా మార్చాలని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పుకొచ్చారు. గురువారం నాడు నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య.. లేపాక్షిలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధికి తనలో చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు పోరాడుతానన్నారు. బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అయితే బాలయ్య ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ అయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇదా.. ఈ ప్రభుత్వ పరిపాలన తీరు’’ అని వ్యాఖ్యానించారు. కరెంటు కోతలు, వేరుశెనగ ఇబ్బందులు అన్ని కష్టాలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వంపై బాలయ్య విమర్శలు గుప్పించారు.
* మీ తండ్రివల్లే కాలేదు.. మీరేం చేస్తారు: లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు సంధించారు. జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి … తన తండ్రి చంద్రబాబుపై గతంలో 26 కమిటీలు వేసి అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నించారని లోకేశ్ ట్విటర్‌లో దుయ్యబట్టారు. ఇప్పుడు జగన్ కూడా అదేపనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుపై అవినీతి మరక అంటించడం మీ తండ్రివల్లే కాలేదు… ఇప్పుడు మీ తరం కాదు’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించి ఛార్జిషీట్లు ఉండడాన్ని జగన్ గుర్తించాలని హితవు పలికారు.
* సుప్రీం ఆదేశాలనూ అతిక్రమించారు: కనకమేడల
తెదేపాకు చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలను భాజపాలోకి చేర్చుకొని పార్టీని విలీనం చేయడంపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపులను భాజపా ప్రోత్సహిస్తోందని కనకమేడల ఆరోపించారు. ఇలాంటి పార్టీ ఫిరాయింపులకు పార్లమెంటు సాక్ష్యంగా నిలవడం విచారకరమన్నారు. ప్రస్తుత పాలక ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు ముగింపు పలుకుతుందని భావించామనీ, ఇందుకు విరుద్ధంగా ఫిరాయింపులకు పాల్పడటం తమను బాధించిందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం పాలక పార్టీ అతిక్రమించిందన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేసి గుత్తాధిపత్యం చేయాలని భాజపా చూస్తోందని ఆరోపించారు.
* ప్రతిచోటా కాపలా ఉండలేం: హోం మంత్రి
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులు, విధ్వంసాలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ… దాడులు జరిగే ప్రతి చోటా కాపలా ఉండలేమని వ్యాఖ్యానించారు. దాడులకు గురైనవారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడులు జరగాలని తాము కోరుకోవట్లేదని, రాజకీయ దాడులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కూడా చెప్పారని హోం మంత్రి గుర్తు చేశారు.
* నాకు మొదట ఫోన్ చేసింది మీరే: మోదీ
జీ20 సదస్సు నిమిత్తం గురువారం ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ ప్రధాని షింజో అబెతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారు అనేక విషయాలు చర్చించారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. అలాగే ఇరువురి నేతల మధ్య ఆత్మీయ సంభాషణ కూడా జరిగింది. ఈ సదస్సులో భాగంగా మోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరవాత మొదటి సారి ప్రపంచ స్థాయి నేతలతో సమావేశం కానున్నారు.
*శంకుస్థాపనలకు సర్వం సిద్ధం
తెలంగాణ కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం, చట్టసభ నిర్మాణాలు చాలా ప్రాధాన్యమైనవి కావడంతో రెండు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ప్రస్తుత సచివాలయం డి-క్ వెనుకభాగంలోని తోటలో సచివాలయ భవనానికి, 11 గంటలకు ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో శాసనసభ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారు. సచివాలయం ప్రస్తుతం 25 ఎకరాల్లో ఉండగా దాన్ని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు.
*కాంగ్రెస్ పార్టీది దురహంకారం
లోక్సభలో తన మాటలతో నిప్పులు చెరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలోనూ అదే వాగ్దాటిని ప్రదర్శించారు. ప్రతిపక్షాన్ని గుక్క తిప్పుకోనివ్వకుండా చేశారు. తాను మాట్లాడట్లేదని విపక్షాలు విమర్శించిన అంశాలను ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ మీద విరుచుకుపడిన మోదీ.. ఎన్నికలకు సంబంధించిన విమర్శలకూ దీటుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన దురహంకారం వల్లే ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఈవీఎంలను అనుమానిస్తోందని విమర్శించారు. జమిలి ఎన్నికల విషయంలోనూ వారి తీరు ఇలాగే ఉందని.. వాళ్లకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా కనీసం చర్చకు ముందుకు రావాలని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానంగా ఆయన బుధవారం కూడా దాదాపు గంటపాటు మాట్లాడారు. ప్రధాని ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించింది. లోక్సభలో ఈ తీర్మానం మంగళవారమే ఆమోదం పొందింది.
*నేనేమీ కాంగ్రెస్ అధ్యక్షుడిని కాదు
‘నేనేమీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాదు. నా నిర్ణయంలో మార్పు ఉండదు’ అని పార్టీ ఎంపీలకు రాహుల్గాంధీ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు రాహుల్ ప్రకటించారు. లోక్సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బుధవారమిక్కడ సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే తమిళనాడు ఎంపీలు రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. మిగతా ఎంపీలు వారికి మద్దతుగా మాట్లాడారు. కానీ, రాహుల్ మాత్రం ససేమిరా అన్నారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఇప్పటికే తాను పార్టీ వర్కింగ్ కమిటీని కోరానని, అయినా ఆ విషయంలో పురోగతి లేదని రాహుల్ అన్నట్టు సమాచారం.
*బాబ్రీ కారణంగానే పీవీని పక్కనబెట్టారు: చిన్నారెడ్డి వ్యాఖ్యలు
మాజీ ప్రధాని దివంగత పీవీనరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో కూర్చున్న పీవీని పిలిచి సోనియాగాంధీ ప్రధానిని చేస్తే.. ఆయన పార్టీలో ఎందరినో అణగదొక్కారని ఆరోపించారు. పీవీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. బాబ్రీమసీదును కూల్చి పెద్ద తప్పిదం చేశారని.. అందుకే ముస్లింలు కాంగ్రెస్కు దూరమయ్యారని, ఆ కారణంగానే ఆయనను గాంధీ కుటుంబం పక్కన పెట్టిందన్నారు.
*రాష్ట్ర విధ్వంసానికిది నాంది
ప్రజావేదికను కూల్చేయడంద్వారా రాష్ట్ర విధ్వంసానికి వైకాపా ప్రభుత్వం నాంది పలికిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. దానిని హుటాహుటిన కూల్చేయడం దుందుడుకు చర్య అని, ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ సమావేశ మందిరం ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని అర్ధరాత్రి వేళ కూలగొట్టాల్సిన అవసరమేముందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు అన్నిరకాల అనుమతులున్నాయా? అని నిలదీశారు.
*అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ
ఒకప్పుడు మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఆ తర్వాత పెద్దయెత్తున అప్పుల్లో కూరుకుపోయిందని తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. పార్టీ నాయకులు బక్కని నర్సింహులు, సామ భూపాల్రెడ్డిలతో కలిసి బుధవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని; సచివాలయం భవనాలను ఎందుకు కూలుస్తున్నారో, అసెంబ్లీని ఎందుకు మారుస్తున్నారో రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వపు కూల్చివేతల జాడ్యం కేసీఆర్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు పట్టుకుందన్నారు.
*రాష్ట్ర విధ్వంసానికిది నాంది
ప్రజావేదికను కూల్చేయడంద్వారా రాష్ట్ర విధ్వంసానికి వైకాపా ప్రభుత్వం నాంది పలికిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. దానిని హుటాహుటిన కూల్చేయడం దుందుడుకు చర్య అని, ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ సమావేశ మందిరం ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని అర్ధరాత్రి వేళ కూలగొట్టాల్సిన అవసరమేముందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు అన్నిరకాల అనుమతులున్నాయా? అని నిలదీశారు. పోలీసు, మున్సిపల్, పంచాయతీ, ఆర్అండ్బీ అధికారుల అనుమతితోనే వాటిని ఏర్పాటు చేశారా? అనుమతులు లేవని వాటినీ కూల్చేయగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం ఉండవల్లిలో తెదేపా ముఖ్య నేతల సమావేశం జరిగింది.
*విద్య, వైద్య వసతులు మెరుగుపర్చాలి
ప్రస్తుతం అద్భుతమైన సేవలందిస్తున్న భవనాలను నేలమట్టం చేసి ఇప్పటికిప్పుడు నూతన భవనాల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, అంతకంటే ముఖ్యంగా విద్య, వైద్యంలో ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా ప్రభుత్వం దృష్టిపెట్టాలని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. తెజస రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆచార్య రమేశ్రెడ్డి, పాండురంగారావు, రాజమల్లు తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.
*బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభలు, ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్లో బుధవారం ప్రదర్శన, ఆందోళన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ..చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వాలు బీసీలను మాత్రం విస్మరించాయన్నారు.
*అర్ధరాత్రి కూల్చే అవసరం ఏమిటో: పయ్యావుల
ఉండవల్లిలో ప్రజావేదికను అర్ధరాత్రి కూల్చేయాల్సిన అవసరం ఏమిటని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ ప్రజావేదికను కూల్చాలనే నిర్ణయం ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనం అన్నారు. హంద్రీనీవా కాలువ రెండు జిల్లాల పరిధిలో ఉందని, కాలువ వెడల్పు పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.
*సెజ్ల స్థానంలో రెజ్లు ప్రవేశపెట్టాలి -గల్లా జయదేవ్
ప్రత్యేక ఆర్థిక మండళ్ల స్థానంలో గ్రామీణ ఆర్థిక మండళ్లు(రెజ్) ప్రవేశపెట్టాలని తెదేపా లోక్సభాపక్షనేత గల్లా జయదేవ్ పేర్కొన్నారు. బుధవారం లోక్సభలో సెజ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పరిశ్రమల స్థాపనకు భూసేకరణ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని జిల్లాల్లో మానవాభివృద్ధి సూచికల్లో ఒక స్థాయికంటే కింద ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయాలని’ ఆయన కోరారు.
*ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే
ప్రజావేదిక పక్కన ఉన్న ఇంటిని చంద్రబాబు వెంటనే ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) డిమాండ్ చేశారు. కృష్ణా నదీ ఒడ్డున నిర్మించిన ఇంట్లో చంద్రబాబు నివాసం ఉండడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. కరకట్ట మీద దాదాపు 57 అక్రమ కట్టడాలున్నాయన్నారు. చంద్రబాబుతో సహా ఎంపీలు కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.
1100 అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాం-రాజకీయ-06/27
Related tags :