*రేపు చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల బుధవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ఆమె పార్ధివ దేహాన్ని నానక్ రామగూడలోని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. ఈ రోజు స్వగృహంలోనే విజయ నిర్మల భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. పలువురు ప్రముఖులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. విజయనిర్మల అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. అభిమానుల సందర్శనార్ధం ఫిలిం చాంబర్లో కొద్ది సేపు ఉంచనున్నారు. ఆ తర్వాత చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారం జరుగుతుంది .
**కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ కుటుంబం
ప్రముఖ నటి, దర్శకురాలు, కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతకొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్పత్రి నుంచి ఆమె భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని ఇంటికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. విజయనిర్మల భౌతికకాయాన్ని చూసి కృష్ణ, ఆయన సతీమణి ఇందిరా దేవి, తనయుడు నరేశ్ కన్నీరుమున్నీరయ్యారు. మంజుల, మహేశ్‌బాబు, నమ్రతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురళీ మోహన్ తదితరులు విజయనిర్మల భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.
**విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మహేష్
కొద్ది రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవార రాత్రి విజయ నిర్మల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితం విజయ నిర్మల భౌతిక కాయాన్ని నానక రామగూడలోని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. అభిమానుల సందర్శనార్దం ఈ రోజు అక్కడే ఉంచనున్నారు. రేపు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. కొద్ది సేపటి క్రితం ఇంటికి చేరిన విజయ నిర్మల పార్ధివ దేహాన్ని చూసి కృష్ణ, నరేష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మహేష్, నమ్రత, జయసుధ,బాల సుబ్రహ్మాణ్యం, మరళీ మోహన్ తో పాటు తదితర ప్రముఖులు విజయ నిర్మల పార్ధివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.
**మండలి కుటుంబంతో విజయనిర్మల మధుర జ్ఞాపకాలు.
**ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత,మా ఆత్మీయురాలు.. శ్రీమతి *విజయనిర్మల* గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విజయనిర్మల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
***విజయనిర్మల మృతికి బుద్దప్రసాద్ సంతాపం
విజయనిర్మల మృతికి ఏపీ మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ తన సంతాపాన్ని వ్యక్తపరిచారు. 1977లో విజయనిర్మల, కృష్ణ అవనిగడ్డ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. మహానటి మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు.
విజయనిర్మలకి నివాళి-చిత్రాలు
Related tags :