ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.
ఇదిలా వుండగా వారణాలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి ‘దీర్ఘసుమంగళిభవః’ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.
ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.
పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !
తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?
పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?
తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.
పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.
తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.
పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ‘తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!’ అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు ‘తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!’ అన్నాడు. అందుకు తులసీదాస్ ‘తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!’ అని కోరుకున్నాడు.ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు ‘తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము’ అని వాగ్దానం చేశారు అప్పటినుండి ఇప్పటివరకు
‘హనుమాన్ చాలీసా’ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.
అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక ‘హనుమాన్ చాలీసా’. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.
2. శారదా పీఠాధిపతులకు కేసీఆర్ పుష్పాభిషేకం
విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర స్వాములకు బుధవారం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా పుష్పాభిషేకం జరిపింది. పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వాత్మానందేంద్ర తొలిసారి హైదరాబాద్ వచ్చారు. ఇటీవల సీఎం విజయవాడకు వెళ్లినప్పుడు స్వాత్మానందేంద్ర, స్వరూపానందేంద్రలకు హైదరాబాద్లో పుష్పాభిషేకం చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు జలవిహార్ వద్ద ఘనంగా ఏర్పాట్లుచేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీఠాధిపతులకు ఘన స్వాగతం పలికారు. మంగళధ్వానాలు, వేదనాదాల మధ్య పూర్ణకుంభంతో సాదరంగా ఆహ్వానించారు. సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, దాదాపు మూడువేలమంది వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాములకు ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు సమర్పించి పుష్పమాలతో సత్కరించారు. హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు స్వరూపానందేంద్ర ఆశీర్వచనాలు అందజేశారు.
3. తిరుమల నుంచి యాదాద్రికి జయవిజయుల విగ్రహాలు
వైష్ణవత్వం ఉట్టిపడే తీరులో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం జరుగుతోంది. వైష్ణవ ఆలయాల్లో జయ విజయుల విగ్రహాలను పొందుపర్చడం సంప్రదాయం. ఆ క్రమంలోనే కృష్ణశిలతో తిరుమల తిరుపతిలో శిల్పకారులు చెక్కిన విగ్రహాలను బుధవారం యాదాద్రికి తీసుకొచ్చారు. ప్రధాన ఆలయ గర్భగుడి ద్వారం ఇరువైపులా వాటిని పొందుపరుస్తారు. పది అడుగుల ఎత్తులో సిద్ధమైన విగ్రహాల స్థాపనకు రాతి గద్దెలను గుట్టకు చేర్చారు. గర్భగుడితో సహా తూర్పు, పడమర దిశల్లోని రాజగోపురాలకు ఇరువైపులా భక్తులను స్వాగతించేలా విగ్రహాలను ఏర్పాటుచేయనున్నట్లు స్థపతులు చెబుతున్నారు. విగ్రహాలను ఆలయ ముఖమండపంలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
4. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.1 కోటి విరాళం
తితిదే శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం కోటి రూపాయల విరాళం అందింది. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు కొమ్మారెడ్డి మాధవి, కొమ్మారెడ్డి నగేష్ దంపతులు ట్రస్టుకు రూ.1.1 కోట్ల విరాళం ఇచ్చారు.
5. 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం
వచ్చే నెల జులై 17 నుంచి ఉత్తరాయనం ముగిసి, దక్షిణాయనం ప్రారంభమవుతుందని తితిదే ఒక ప్రకటనలో పేర్కొంది. జులైలో విశేష ఉత్సవాల వివరాలు వెల్లడించింది. ఏడున మరీచి మహర్షి జయంతి, 12న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం, 16న ఆషాఢ పూర్ణిమ, వ్యాసరాజ, గురు పూర్ణిమ, చంద్రగ్రహణం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, కర్కాటక సంక్రమణం, 28న సర్వ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయని వివరించింది.
6. శుభమస్తు
తేది : 27, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వార : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(నిన్న తెల్లవారుజాము 4 గం॥ 15 ని॥ నుంచి
ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 44 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 39 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 42 ని॥ వరకు)
యోగము : అతిగండము
కరణం : గరజ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 49 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 59 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 14 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 35 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 39 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మీనము
7. చరి ఈ రోజు/జూన్ 27
1838: వందేమాతర గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ జననం (మ.1894).
1880: అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన హెలెన్ కెల్లర్ జననం (మ.1968).
1955: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం.
1967: ఇంగ్లాండు లోని ఎన్‌ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఎ.టి.ఎం యంత్రాన్ని ప్రవేశపెట్టారు.
2008: సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా మరణం (జ.1914).
1978: సహకార రంగానికి ఎనలేని సేవచేసిన జవ్వాది లక్ష్మయ్యనాయుడు మరణం (జ.1901).
1980: తెలుగు రంగస్థల నటి సురభి ప్రభావతి జననం.
8. తిరుమ సమాచారం
*ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం.
*27.06.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *22C° – 30℃°
నిన్న *81,486* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని *08*
గదులలో భక్తులు
వేచి ఉన్నారు,
ఈ సమయంశ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*14* గంటలు పట్టవచ్చును
నిన్న *8,929* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 4.19* కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
*వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి
9. ముఖ న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి ఏరాసు అయ్యపురెడ్డి మరణంప్రహ్లద సమేత స్వయంభూగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానముకదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్ఫోన్ నెం : 08494 – 221066, 221366 27.06.2019 వతేది, *గురువారం ఆలయ సమాచారం*
*శ్రీస్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకై అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ.. తదుపరి స్వామివారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, అలంకరణ, మహా మంగళహారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు..అనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును. తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును.. రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.00 నుండి 6.30 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 6.30 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు
*27.06.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 3
*27.06.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 4