ఉప్పులో డేంజర్ కెమికల్స్……
అమెరికన్ వెస్ట్ ఎనలిటికల్ లేబొరేటరీస్ రిపోర్టులో వెల్లడి
టాప్ బ్రాండ్ల ఉప్పులో పొటాషియం ఫెర్రో సయనైడ్, క్యాన్సర్ కారకాలు
కిలో ప్యాకెట్‌లో 1.85 మి.గ్రా నుంచి 4.71మి.గ్రా. దాకా..
కేన్సర్, థైరాయిడిజం, బీపీ, ఊబకాయం, కిడ్నీ జబ్బులొచ్చే ప్రమాదం
‘కూరలో అన్నేసి చూడు.. నన్నేసి చూడు’ అంటుందట ఉప్పు. దినుసులు ఎన్నేసినా ఉప్పు లేనిదే కూరకు టేస్ట్ రాదు. అలాంటి ఉప్పులో మనకు ముప్పు తెచ్చే అనేక విషపూరితాలు ఉన్నాయంటున్నారు అమెరికాకు చెందిన సైంటిస్టులు! ఇండియాలో వాడే టాప్ బ్రాండెడ్ సాల్ట్ ప్యాకెట్లు అంత సురక్షితం కాదని, వాటిలో పొటాషియం ఫెర్రో సయనైడ్, కేన్సర్ కారకాలు ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. అమెరికాకు చెందిన అమెరికన్ వెస్ట్ ఎనలిటికల్ లేబొరేటరీస్ తాజాగా తన రిపోర్టులో ఈ విషయం తెలిపింది.హైదరాబాద్, ఉప్పులో వివిధ రకాల ప్రమాదకర మిశ్రమాలు కలుపుతున్నారని అమెరికన్ వెస్ట్ ఎనలిటికల్ లాబొరేటరీస్ వెల్లడించింది. గతంలో ఉప్పు విడిగా కిలోల లెక్క అమ్మేవారు. ప్రస్తుతం ప్యాకెట్లలో ఐయోడైజ్డ్, రిఫైన్డ్ తదితర పేర్లతో మార్కెట్‌లో అమ్ముతున్నారు. వీటి ధర కూడా ఎక్కువే. అయితే కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన కిలో ఉప్పులో 1.85 మిల్లీ గ్రాముల నుంచి 4.71మి.గ్రా. పొటాషియం ఫెర్రో సైనైడ్ ఉందని ఆ సంస్థ పేర్కొంది. ‘‘పొటాషియం ఫెర్రో సైనైడ్ అనేది అత్యంత విష పదార్థం. అలాంటిదాన్ని ఉప్పులో, తినే వివిధ రకాల ఆహార పదార్థాల్లో సాల్ట్ కంపెనీలు యథేచ్ఛగా కలిపేస్తున్నాయిఅయోడిన్, సయనైడ్ వంటి ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలను కంపెనీలు ప్రాసెస్ చేసి ప్యాకెట్లలో రూపంలో ఉప్పు పేరుతో అమ్ముతున్నాయి. ఈ కెమికల్స్‌తో కేన్సర్, హైపర్ థైరాయిడిజం, హైబీపీ, ఇంపొటెన్సీ(నపుంసకత్వం), ఊబకాయం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది’’ అని గోధుమ్ గ్రైన్స్ అండ్ ఫామ్స్ ప్రొడక్ట్ చైర్మన్, సామాజిక వేత్త శివ శంకర్ గుప్తా తెలిపారు. సాల్ట్‌ను అయోడిన్, సయనైడ్ వంటి డేంజర్ కెమికల్స్‌తో రిఫైన్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఉప్పులో అయోడిన్ సహజంగా ఉంటుందని, కానీ కంపెనీలు తమ ఉప్పులో కృత్రిమ అయోడిన్‌ను యాడ్ చేసి భారీగా ప్రచారం చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయన్నారు. గుజరాత్‌లోని కచ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉన్న సహజ ఉప్పు పరిశ్రమలను ప్రభుత్వాలు పథకం ప్రకారం నాశనం చేశాయని శివ శంకర్ ఆరోపించారు.‘‘ఉప్పు తయారు చేసే పెద్ద కంపెనీలేవీ తమ ప్రొడక్ట్స్‌ను పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)ను కోరలేదు. లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. దేశంలో ఆహార పదార్థాల క్వాలిటీని పరీక్షించే ల్యాబ్‌లకు కూడా మనం తినే ఉప్పులో ఎంత సయనైడ్ ఉందో చెప్పే టెక్నాలజీ లేదు’’ అని శివశంకర్ పేర్కొన్నారు. ప్రజలకు సహజమైన, సురక్షిత ఉప్పు అందేలా చూడాలని, ప్రమాదకరమైన సాల్ట్ తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఈయన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు.
ఊబకాయం క్యాన్సర్‌లకు కారణం ఉప్పు
Related tags :