DailyDose

కోలా కన్ను కాఫీ పైన-వాణిజ్య-06/28

Daily Business News - Cola Looking To Enter Coffee Market - June 28 2019

*టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)కి సంబంధించిన ప్రస్తుత సిరీస్ను సవరించడం కోసం ప్రభుత్వం 18 మంది సభ్యులతో ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
*సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎమ్ఈలు) ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని ఒకరిని నియమించాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది.
*తమ సంస్థ సరికొత్త మోడల్ ‘హ్యుందాయ్ వెన్యూ’ ఒక్క రోజులోనే 1000 కార్లు అమ్ముడై రికార్డు సృష్టించిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయ విభాగాధిపతి వికాస్ జైన్ ఇక్కడ తెలిపారు.
*ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మధ్య మరింత సమన్వయం ఉంటే, వృద్ధికి ఊతం లభిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.
*రూ.150 కోట్ల వాణిజ్య పత్రాల చెల్లింపుల్లో విఫలమైనట్లు ట్రావెల్ అండ్ టూర్ సంస్థ, కాక్స్ అండ్ కింగ్స్ గురువారం ప్రకటించింది.
* ఆ రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే. కానీ ఒక సంస్థ ఇచ్చిన కాంట్రాక్టును రెండో సంస్థ సకాలంలో పూర్తి చేయలేకపోయింది.
*కొరియా సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటైన టోరా క్యాబ్స్ టెక్నాలజీస్ సర్వీసెస్ అనే సంస్థ దేశీయంగా క్యాబ్ సేవల్లోకి అడుగుపెట్టింది.
*పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఐరోపాలో మొత్తం 12,000 ఉద్యోగాల కోత విధించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా వాహన సంస్థ ఫోర్డ్ ప్రకటించింది.
*హానర్ 20 శ్రేణి సహా అన్ని స్మార్ట్ఫోన్లకు గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ అప్డేట్స్ లభిస్తాయని చైనా స్మార్ట్ఫోన్ల సంస్థ హువావే ప్రకటించింది.
*అధిక మోతాదులో కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేసేటప్పుడు, ఆ ప్యాకింగ్ ముందు భాగంలో ఎరుపు రంగు కోడ్తో ఒక లేబుల్ అతికించాల్సి ఉంటుంది.
*చౌకధరల విమానయాన సంస్థ గో ఎయిర్ విమానాల సంఖ్య 50కి చేరింది. ఎయిర్బస్ ఏ320 నియో విమానం గురువారం తమకు జత చేరిందని, ఇకపై ప్రతినెలా ఒక విమానం అదనంగా సమకూరుతుందని గో ఎయిర్ వెల్లడించింది.
*ఎంజీ మోటార్ ఇండియా తమ స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) ‘హెక్టార్’ను విపణిలోకి విడుదల చేసింది. పరిచయ ధరల శ్రేణిని రూ.12.18-16.88 లక్షలుగా ప్రకటించింది.
*జర్మనీకి చెందిన విలాసవంత వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూపు సంస్థ బీఎండబ్ల్యూ మోటార్డ్ తమ సూపర్బైకుల్ని భారత్లో గురువారం విడుదల చేసింది.