* టీడీపీలో మరో కలకలం. టీడీపీ ముఖ్యనేత..పార్టీ మౌత్ పీస్‌గా వ్యవహరించే బోండా ఉమ మరో పార్టీలో చేరుతున్నారా. ఇప్పుడు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ. కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశంలో పాల్గొన్న బోండా ఉమ పార్టీని వీడుతున్నారని టీడీపీ ముఖ్య కేంద్రం అంచనాకు వచ్చేసారు. బోండా ఉమా పార్టీ వీడితే విజయవాడ సెంట్ర్‌లో ప్రత్యామ్నాయ నేత ఎవరనే దాని పైన అప్పుడే అన్వేషణ మొదలైంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఉమాకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో..ఆయన దీని పైన నేరుగా అధినేతతోనే తేల్చుకొనేందుకు సిద్దమయ్యారు.
* అమర్‌నాథ్ యాత్ర తర్వాత కశ్మీర్‌లో ఎన్నికలు-లోక్‌సభలో అమిత్ షా తొలి బిల్లు
భద్రతా కారణాల రీత్యా జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడగిస్తున్నామని, అమర్‌నాథ్ యాత్ర తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని అమిత్ షా లోక్‌సభలో నేడు ప్రవేశపెట్టారు.
భద్రతా పరిస్థితుల దృష్ట్యా అమర్‌నాథ్ యాత్ర తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల జులై 3 నుంచి ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడగించడం ఆవశ్యమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఈ తీర్మానానికి సభ్యులు మద్దతివ్వాలని కోరారు. అంతేగాక.. గవర్నర్, రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రంలో ఉగ్రదాడులు తగ్గాయని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు.
*కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించాలని ఇవాళ లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. జూలై 2వ తేదీన ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ రాష్ట్రపతి పాలలను పొడిగించాలని కేంద్ర మంత్రి అమిత్ షా బిల్లులో కోరారు. రంజాన్, అమర్‌నాథ్ యాత్ర వల్ల అసెంబ్లీ ఎన్నికల నిర్వహిణ ఆలస్యమైనట్లు చెప్పారు. ఈ ఏడాది చివరలోగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు షా తెలిపారు. ఆర్టికిల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్‌ను పొడిగించాలని షా కోరారు. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని కోసం కూడా ఇవాళ బిల్లును ప్రవేశపెట్టారు. కశ్మీర్‌లో సుమారు 15 వేల బంకర్లను నిర్మించినట్లు మంత్రి చెప్పారు. గోవులు మరణిస్తే నష్టపరిహారాన్ని కూడా ఇవ్వనున్నారు.
* జగన్‌పై లోకేశ్ విమర్శలు..
ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి ట్విట్టర్‌లో విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్. వైఎస్ హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ ఎంతకు కొన్నారో, చంద్రబాబు పాలనలో యూనిట్‌కి ఎంత ఖర్చు పెట్టామో చూడండంటూ లెక్కలు తీశారు. కనీస ఆధారాలు లేకుండా టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల 2వేల 636 కోట్లు అవినీతి జరిగిందని తేల్చడం ఏంటని ప్రశ్నించారు. గుడ్డ కాల్చి మీద వేయడంలో మీకు మీరే సాటి అంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, ఈ ఐదేళ్లలో మిగులు విద్యుత్తు సాధించామని లోకేష్ అన్నారు. 5 ఏళ్లలో 150కిపైగా అవార్డులు సాధించామని చెప్పారు. ఐదేళ్లలో 36 వేల కోట్ల పెట్టుబడితో 13వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ పెట్టుబడులు అడ్డుకుని రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు లోకేష్.
* చంద్రబాబు స్థానికంగానే ఉండాలి: మాజీ ఎమ్మెల్యే శ్రావణ్
తుళ్ళూరులో రాజధాని రైతుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్డీఏ రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.తక్షణమే కౌలు సొమ్మును రైతుల అకౌంట్‌లలో జమ చేయాలన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఓ కమిటిని వేయాలని డిమాండ్ చేశారు. రాజధాని బ్రాండ్ అంబాసిడరైన చంద్రబాబు స్థానికంగానే ఉండాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుపై కక్ష్య సాధింపు సరైనది కాదని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
*ఇది ముమ్మాటికీ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్య: యనమల
ఈ భవనం నిర్మించినప్పడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారుఅక్రమంగా కట్టారని భావిస్తే ఆ రోజు వైఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు..?అక్రమ కట్టడాలకు అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది..?వైఎస్ పేరుతో ఉన్న పార్టీని కొడుకు జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడువైఎస్ బొమ్మ పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారువైఎస్ కాలంనాటివి అక్రమ కట్టడాలైతే వాటికి జగన్ బాధ్యత వహించాలితండ్రి అనుమతిచ్చిన నిర్మాణాలకు కొడుకు నోటీసులు పంపడమా..?అవన్నీ అక్రమ నిర్మాణాలైతే బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డేభవనం నిర్మించే సమయానికి సిఆర్ డిఏ లేదు. అప్పటికి అమరావతి రాజధాని ప్రతిపాదన లేదు. ఈ భవనానికి 2008లో గ్రామ పంచాయితీ అనుమతి ఇచ్చింది. రివర్ కన్జర్వేటర్ 2012లో అనుమతి ఇచ్చారు.చంద్రబాబుపై కక్షతోనే నదికి 130మీ దూరంలో ఉన్న ప్రజావేదికను కూలగొట్టారు.ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసానికే ఏకంగా నోటీసులు అంటించారుది విధ్వంసక ప్రభుత్వంగా మారింది. భవనాలను నేలమట్టం చేస్తోంది,ఇళ్లకు నోటీసులిస్తోంది, పౌరులపై దాడులు చేయిస్తోంది. రాష్ట్ర అభివృద్దిపై సీఎం జగన్ కు దృష్టి లేదు, పేదల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి శ్రద్ద లేదు. కూలగొట్డడం, విధ్వంసం చేయడడం,భయోత్పాతం సృష్టించడమే జగన్ దినచర్యబెదిరించడం,దాడులు చేయడం,దౌర్జన్యాలు జరిపించడం జగన్ నిత్యకృత్యాలుచంద్రబాబు నిర్మాణానికి కృషి చేస్తే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారు. ఈ దుందుడుకు చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి.
*చంద్రబాబు భద్రత మరింత తగ్గింపు
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత కుదించింది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను తొలగించటంతో పాటు, చంద్రబాబు వాహనశ్రేణిలో స్థానిక పోలీసులు ఇవ్వాల్సి ఉన్న ఎస్కార్ట్, పైలెట్ క్లియరెన్స్ వాహనాలను తొలగించిన సర్కారు తాజాగా మరో వివాదాస్పద చర్యకు పూనుకుంది. చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించటంతో పాటు వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తప్పించారు.
*ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి నోటీసు
కృష్ణానది కరకట్టలోపల అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం ఉండవల్లి కరకట్ట వద్ద మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనానికి సీఆర్డీఏ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ నోటీసు అంటించారు. తమ సాంకేతిక సిబ్బంది పరిశీలనతో ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించినట్లు సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. చంద్రబాబు నివాసం ఉంటోన్న భవనం యజమాని లింగమనేని రమేష్ పేరిట నోటీసులు జారీ చేశారు.
*రాష్ట్రానికి మకుటాయమానం
కొత్త సచివాలయం, శాసనసభ భవనాలను తెలంగాణకు మకుటాయమానంగా నిలిచేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చక్కటి వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సీఎం చేతుల మీదుగా గురువారం కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు ఘనంగా శంకుస్థాపనలు జరిగాయి. ఉదయం 11 గంటలకు ఆయన సచివాలయం డి-బ్లాక్ వెనుక భాగంలోని తోటలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమిపూజ చేశారు.
*పీవీపై వ్యాఖ్య బాధాకరం: దత్తాత్రేయ
మాజీ ప్రధాని-దివంగత నేత పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్య అనుచితం, బాధాకరం, రాజకీయ ప్రేరేపితమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్న తరుణంలో సంస్కరణల ద్వారా దేశాన్ని గట్టెక్కించిన పీవీని విమర్శించడం సరికాదని గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుబిడ్డ పీవీ మరణించినప్పుడు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కనీస మర్యాద ఇవ్వలేదని, పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా కనీసం స్మారక నిర్మాణమైనా ఏర్పాటుచేయలేదని ఆయన నిరసన వ్యక్తంచేశారు.
*తెరాస దుష్పరిపాలనకు వ్యతిరేకంగానే
తెలంగాణలో తెరాసకు పూర్తి మెజారిటీ ఉన్నా అప్రజాస్వామికంగా వ్యవహరించడం.. దుష్పరిపాలన చేస్తుండడంతోనే వివిధ పార్టీల నేతలు భాజపా దరి చేరుతున్నారని.. ఆ క్రమంలోనే భారీగా చేరికలు సాగుతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్రావు అన్నారు. తెదేపా.. కాంగ్రెస్లకు చెందిన మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, హన్మకొండ మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి, పీసీసీ మైనారిటీ విభాగం మాజీ ఛైర్మన్ షేక్ రహంతుల్లా గురువారం మురళీధర్రావు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కృష్ణదాస్ సమక్షంలో భాజపాలో చేరారు.
*పీవీపై వ్యాఖ్య బాధాకరం: దత్తాత్రేయ
మాజీ ప్రధాని-దివంగత నేత పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్య అనుచితం, బాధాకరం, రాజకీయ ప్రేరేపితమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్న తరుణంలో సంస్కరణల ద్వారా దేశాన్ని గట్టెక్కించిన పీవీని విమర్శించడం సరికాదని గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుబిడ్డ పీవీ మరణించినప్పుడు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కనీస మర్యాద ఇవ్వలేదని, పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా కనీసం స్మారక నిర్మాణమైనా ఏర్పాటుచేయలేదని ఆయన నిరసన వ్యక్తంచేశారు.
*కాంగ్రెస్లో ‘విధేయుల ఫోరం’
కాంగ్రెస్లో పార్టీ విధేయుల ఫోరం ఏర్పాటు చేయాలని సీనియర్ నేతలు నిర్ణయించారు. గురువారం నిజాం క్లబ్లో సీనియర్ నేతలు వీహెచ్, మర్రి శశిధర్రెడ్డి, ఎం.కోదండరెడ్డి, సంభాని చంద్రశేఖర్, శ్యాంమోహన్, కమలాకర్రావు, జి.నిరంజన్ తదితరులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, వలసలు తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా కాంగ్రెస్లో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కోల్పోయాయని, వారిలో తిరిగి ఆత్మవిశ్వాసం నింపాలంటే ఏం చేయాలనే అంశం చర్చకు వచ్చింది.
*సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలి
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు పట్ల అవమానకరంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలని పీవీ మనవడు సుభాష్ డిమాండ్ చేశారు. పార్టీకి విధేయుడిగా ఉన్న పీవీని నెహ్రూ- గాంధీ కుటుంబం ఘోరంగా అవమానించిందని ఆరోపించారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి.. పీవీపై చేసిన పలు ఆరోపణల నేపథ్యంలో సుభాష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
*పార్టీ భవిష్యత్తును ఆశించే మాట్లాడా: రాజగోపాల్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ మంచి భవిష్యత్తును ఆశించే తాను అలాంటి వ్యాఖ్యలు చేశానని, వాటిని పార్టీ వ్యతిరేకమైనవిగా భావించడం సరికాదని కాంగ్రెస్ నేత, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీకి వివరణ ఇచ్చారు. టీపీసీసీ ఇచ్చిన తాఖీదుపై ఆయన క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డికి వివరణ పంపారు. మూడు పేజీల వివరణలో ఆయన తాను పార్టీ నాయకత్వంపై, నాయకులపై చేసిన ఆరోపణలను సమర్థించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
*బీసీ బిల్లుకు మద్దతివ్వాలి
రాజ్యసభలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి గహ్లోత్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని దిల్లీలో ఆయన గురువారం కలుసుకున్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు భాజపా మద్దతిచ్చేలా చూడాలని కోరారు. డీఎంకే, అన్నా డీఎంకే, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేడీ, ఆర్జేడీ, వైకాపాలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు 86 మందిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిసి బిల్లుకు మద్దతు ఇవ్వాలని విన్నవించారు.మంత్రిని, ఎంపీని కలిసినవారిలో కృష్ణ, నీల వెంకటేశ్, భూపేష్ సాగర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
*ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహులే కొనసాగాలి: మర్రి
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షుడిగా రాహుల్గాంధీయే కొనసాగాలని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలని రాహుల్గాంధీ విశేషంగా కృషి చేశారన్నారు. రాహుల్ ఒకవేళ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే ఆయన స్థానంలో ప్రియాంక గాంధీని ఏఐసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని సోనియాగాంధీని కోరారు.
*మాజీ మంత్రి గంటా, తోట త్రిమూర్తులు భేటీ
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గురువారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఇటీవల కాకినాడలో కాపు సామాజికవర్గానికి చెందిన తెదేపా నేతల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను గంటాకు త్రిమూర్తులు వివరించారు. కాకినాడలో సమావేశమైన నాయకులు సహా, పార్టీలో కాపు సామాజికవర్గానికి చెందిన ముఖ్య నాయకులు త్వరలో గంటా ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమవనున్నారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితోనే కాపు సామాజికవర్గ నాయకులు కాకినాడలో భేటీ అయ్యారని అప్పట్లో ప్రచారమైంది. దీన్ని ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులంతా ఖండించారు.
*మీరు నీతి, నిజాయతీ అని మాట్లాడటం బాగాలేదు
‘వైఎస్ జగన్ గారూ..! అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి ఛార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైల్లో ఉన్నారు. మీరు నీతి, నిజాయతీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగాలేదు సార్..!’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురువారం ట్వీట్ చేశారు. ‘మీ బాబు.. మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరకు ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది’ అని పేర్కొంటూ గతంలో చంద్రబాబుపై వైఎస్ ప్రభుత్వం వేసిన సభా సంఘాలు, విచారణ కమిటీల జాబితాను లోకేష్ తన ట్వీట్కు జత జేశారు. ‘పోలవరంపై తెదేపా హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతిపరులే అని ముద్ర వేయాలనుకుంటున్న మీ కల కలగానే మిగిలిపోతుంది’ అని పేర్కొన్నారు.
*రాష్ట్రంలో చీకటి పాలన
తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెడుతున్నారని శాసనమండలిలో తెదేపా పక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వరుసగా నాలుగేళ్లు రెండంకెల వృద్ధి, 3 రెట్లు తలసరి ఆదాయం పెంచిన తెదేపా పాలనను చీకటి యుగంతో పోల్చడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెదేపా నేతలపై కక్షసాధించేందుకు కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేశారని యనమల విమర్శించారు. తన తండ్రి పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి ఇప్పుడు ‘నో లూటీ’ అనడం.. రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు అఫిడవిట్లో సీబీఐ పేర్కొన్న వ్యక్తి అవినీతి ఉండకూడదు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
బొండా ఉమా జంప్?-రాజకీయ-06/28
Related tags :