స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత్ కేంద్రంగా పనిచేస్తున్న శాఖలు సహా మన దేశ సంస్థలు దాచిన డబ్బు గత ఏడాది 6 శాతం మేర తగ్గింది. ఇది రెండు దశాబ్దాల్లో రెండో భారీ తగ్గుదలని స్విస్ నేషనల్ బ్యాంకు (ఎస్ఎన్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో మొత్తం విదేశీయులు దాచిన సొమ్ము కూడా 4 శాతం మేర తగ్గింది. గత ఏడాది భారతీయులు దాచిన సొమ్ము రూ.6,757 కోట్లుగా ఉంది. విదేశీయులందరి సొమ్ము రూ.99 లక్షల కోట్లు.ఇవన్నీ బ్యాంకులు నివేదించిన అధికారిక గణాంకాలు. భారతీయులు దాచుకున్న నల్లధనం పరిమాణాన్ని ఇది సూచించడంలేదు. భారతీయులు, ఎన్నారైలు… వివిధ దేశాల్లోని సంస్థల పేరుతో స్విస్ బ్యాంకుల్లో దాచిన సొమ్ము ఇందులో లేదు.
స్విస్ బ్యాంకు అంటేనే భయపడి ఛస్తున్న భారతీయులు
Related tags :