జులై 4,5,6 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు అమెరికాలోని వాషింగ్టన్ డీసిలోని వాల్టార్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నాడు కన్వెన్షన్ సెంటర్ ప్రతినిధులతో తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఆధ్వర్యంలో తానా బృందం కమిటీల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహాసభల చైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి, తానా కోశాధికారి రవి పొట్లూరి, కమిటీ చైర్మన్ ఉప్పుటూరి రామ్ చౌదరి, సభలకు సహాయ ఆతిథ్యం అందిస్తున్న GWTCS అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 20వేల మంది అతిథులకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని, పరిసర ప్రాంతాల్లోని హోటల్స్ నిండిన కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సతీష్ పేర్కొన్నారు. ఈ మహాసభలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, రంగస్థల నటులు, నృత్యకళాకారిణులు, గాయనీగాయకులు, సాహితీవేత్తలు, వాణిజ్య ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ మహాసభలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా జాతీయ కార్యదర్శి రాంమాధవ్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, నటీమణి పూజా హెగ్డే తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, థమన్, ప్రముఖ గాయని సునీతల ఆధ్వర్యంలో మూడు సంగీత విభావిర్ కార్యక్రమాలు అలరించనున్నాయి. మరింత సమాచారం కోసం www.TANA2019.org చూడవచ్చు.
22వ తానా సభల ఏర్పాట్లను పర్యవేక్షించిన వేమన సతీష్
Related tags :