స్మార్ట్ ఫోన్ చూస్తేగానీ నిద్రపట్టనిరోజులు..అలాంటి వారు భవిష్యత్తులో జ్ఞాపక శక్తి, సమస్యలను పరిష్కరించే తెలివితేటలు, ఏకాగ్రత కోల్పోతారని తాజా సర్వే హెచ్చరిస్తోంది. రాత్రి నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాపలను దూరంగా పెడితే మంచిదని సూచిస్తోంది. నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఫోన్‌తో కుస్తీ పడితే మెదడుకు తప్పుడు సంకేతాలు వెళ్లి.. ఇంకా మెలకువగానే ఉన్నట్లు భావిస్తుందని, ఫలితంగా ఒత్తిడి పెరుగుతుందని యూసీఎల్‌ఏ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ డాన్ సీగల్ చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల రాత్రివేళ నిద్రకు దోహదపడే హార్మోన్ దెబ్బతింటుందని, శరీరాన్ని చీట్ చేయవద్దని ఆయన సూచిస్తున్నారు. ‘ఇలాంటి అలవాటు ఉన్నవారు రాత్రిపూట కొద్దిసేపే నిద్రపోయినా ఉదయం లేచినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉన్నట్లు భావిస్తారు. కానీ, రోజూ రాత్రి కనీసం 7-9 గంటలు నిద్ర పోవాలి. అప్పుడే శరీరం అన్నింటికీ సహకరిస్తుంది’ అని వివరిస్తున్నారు.
రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్ చూస్తే ఏకాగ్రత కోల్పోతారు
Related tags :