యువ కథానాయకుడు సందీప్ కిషన్.. తన ఫొటో పెట్టి ఫేక్ ప్రొఫైల్ సృష్టించిన ఆకతాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో సందీప్ కిషన్ పేరిట అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్లు పెడుతూ దూషిస్తున్నాడని సందీప్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాంటివారితో అప్రమత్తంగా ఉండాలని అభిమానులను కోరారు. ‘నాకు రోజూ స్నేహితుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఓ వ్యక్తి నా ఫొటో పెట్టి ఫేస్బుక్లో ఫేక్ ఖాతాను సృష్టించాడట. ఆడపిల్లలకు అసభ్యకర మెసేజ్లు పంపుతూ దూషిస్తున్నాడు. వెరిఫైడ్ అకౌంట్ నుంచి కాకుండా నా ఫొటోలు ఉన్న మరే ఖాతాల నుంచి వచ్చే సందేశాలకు మీరు స్పందించవద్దని వేడుకుంటున్నాను. అలాంటివారితో జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు.
ఫేక్ ఫేస్బుక్ దెబ్బకు సందీప్ కిషన్ సందేశం
Related tags :