Business

గన్నవరం-సింగపూర్ సర్వీసు ఆగిపోయింది

Gannavaram-Singapore Service By Indigo Stops For Good

గన్నవరం నుంచి సింగపూర్కు నడుస్తున్న ఇండిగో విమాన సర్వీసు ఆగిపోయింది. లోటు భర్తీ నిధి (వీజీఎఫ్) విధానంలో సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఈ నెలాఖరుతో ముగిసింది. ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం పొడిగించక పోవడంతో విమాన సర్వీసును నిలిపేశారు. సింగపూర్ సర్వీసులను నిలిపేస్తున్నట్టు విమానాశ్రయ అధికారులకు, ఇండిగో సంస్థకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నుంచి శుక్రవారం సమాచారం అందింది. వీజీఎఫ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇండిగో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2018 డిసెంబరు 4 నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు ఆరంభమయ్యాయి. వారంలో మంగళ, గురు రెండు రోజులు సింగపూర్-గన్నవరం, తిరిగి గన్నవరం- సింగపూర్కు సర్వీసులు నడిచాయి. ఈ నెల 27న చివరి సర్వీసు గన్నవరం నుంచి సింగపూర్ వెళ్లింది. 180 సీట్ల సామర్థ్యం ఉన్న విమానంలో 168 మంది సింగపూర్ వెళ్లారు.