Movies

మెంటల్ జడ్జిమెంటల్ అయింది

Mental Hai Kya Title Renamed To Judgemental Hai Kya

కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మెంటల్‌ హై క్యా’. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించారు. మొదటిసారి టైటిల్‌ వెల్లడించడంతోనే ఈ సినిమా చుట్టూ వివాదాలు అలముకున్నాయి. మానసిక రోగులను అవమాన పరిచేలా ఈ టైటిల్‌ ఉందంటూ ‘ఇండియన్‌ సైకియాట్రిస్ట్‌ సొసైటీ(ఐపీఎస్‌), దీపికా పదుకొణె ‘ది లైవ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’లు చిత్ర బృందంతో పాటు, సీబీఎఫ్‌సీ చీఫ్‌ ప్రసూన్‌ జోషికి లేఖ రాశాయి. టైటిల్‌ మార్చాలంటూ డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కంగన సీబీఎఫ్‌సీని కలిసింది. అవసరమైతే టైటిల్‌ మార్చేందుకు సుముఖంగానే ఉన్నట్లు అనంతరం మీడియాకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా పేరు ‘జడ్జిమెంటల్‌ హై క్యా’గా మార్చాలని అనుకుంటున్నట్లు బాలాజీ టెలీ ఫిల్మ్స్‌ తెలిపింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.