Videos

[Video] శర్వానంద్ రణరంగం టీజర్

Sharwanand Ranarangam Telugu Teaser Video Is Here

‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ, మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’ అంటున్నారు శర్వానంద్‌. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రణ రంగం’. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికలు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’ అంటూ 90ల నాటి కాలం కథతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. చివర్లో ‘కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.