Politics

సామాజిక మాధ్యమాలు వీడి నైపుణ్యాలు మెరుగుపరుచుకోండి

Vice President Of India Advices Students To Spend Less Time On Social Media

నిత్యం సామాజిక మాధ్యమాల్లోనే ఉంటూ సమయాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టిసారించాలని యువతకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్‌ కళాశాల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, ఓయూ వీసీ రామచంద్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలపై ఉపరాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు. పుస్తక పఠనంతో విజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఎక్కడికి వెళ్లినా మాతృభాషను, మాతృభూమిని మరచిపోవద్దన్నారు. స్వచ్ఛభారత్‌ అందరి బాధ్యత అన్నారు. గొప్ప కలలు కనండి.. వాటిని కష్టపడి సాధించుకోండి అని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.