పిల్లల్లో సామాజిక చొరవ అలవడాలంటే.. తల్లులే కలగజేసుకోవాలి! చదువుల పేరుతో వాళ్లని ఆటలకీ, స్నేహాలకీ దూరం చేయడం మానాలి. నిజానికి, బడిలో నేర్పని ఎన్నో విషయాలు వాళ్లు స్నేహాల ద్వారానే తెలుసుకుంటారనే విషయం అర్థం చేసుకోండి.
* పిల్లలకు స్నేహితులు తోడయ్యేది ఆటల్లోనే. అవే వారిలో చొరవను పెంపొందిస్తాయి. గెలుపోటముల్ని ఎదుర్కోవడం కూడా క్రీడలతోనే తెలుస్తుంది. ఆటల్లోని స్ఫూర్తిని వారికి అందించండి. మీ చిన్నారీ, ఆమె స్నేహితుల మధ్య ఆటల పోటీలు ఏర్పాటుచేసి చాక్లెట్లూ, బిస్కెట్‌లూ, బొమ్మలు వంటివి బహుమతులుగా ఇవ్వండి. వాటి రుచితో పాటు స్నేహమాధుర్యం కూడా వాళ్లు చవిచూస్తారు!
* మీ చిన్నారులు ఎప్పుడైనా వారి స్నేహితుల గురించి చెడుగా చెబుతున్నప్పుడు ‘నువ్వు వాళ్లతో కలవొద్దు..!’ అని చెప్పకండి. ఎందుకంటే చిన్నారుల చిట్టి బుర్రలు వికసించేది వారి స్నేహాలతోనే మరి. వారాంతాల్లో మీ పిల్లల స్నేహితుల్నీ, వారి తల్లిదండ్రుల్నీ కూడా ఇంటికి పిలవండి. వారికి నచ్చిన తినుబండారాలన్నీ చేసిపెట్టండి. మీరూ వాళ్ల ఇంటికి వెళ్లడం అలవాటు చేసుకోండి.
మీ పిల్లలు అందరిలో కలవట్లేదా?
Related tags :