మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత్రి, పద్మశ్రీ కోటేశ్వరమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉయదం తుది శ్వాస విడిచారు. మంగళవారం విజయవాడలో కోటేశ్వరమ్మ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణాజిల్లా గోసాల గ్రామంలో 1925 సెప్టెంబరు 15న కోటేశ్వరమ్మ జన్మించారు. బాలికా విద్యపై కోటేశ్వరమ్మ విశేష కృషి చేశారు. మాంటిస్సోరి పాఠశాలలు, ఇంటర్ డిగ్రీ కళాశాలల ద్వారా లక్షలాది మందికి విద్యాదానం, స్త్రీ విద్య, సమాజ నిర్మాణం, మహిళా సాధికారత కోసం కృషి చేశారు. కోటేశ్వరమ్మ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ 1955లో మాంటిస్సోరి పాఠశాల స్థాపించారు. విద్యారంగానికి ఆమె అందించిన ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1971లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయ అవార్డు, 1980లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నారు. కోటేశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మాంటిస్సోరి కోటేశ్వరమ్మ మృతి
Related tags :