ప్రపంచకప్‌లో టీమిండియా తొలి ఓటమి నమోదు కావడంపై పీడీపీ అధినేత్రి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. భారత జట్టు ఓటమికి నూతనంగా ధరించిన ఆరెంజ్ జెర్సీనే కారణమని వ్యాఖ్యానించారు.‘‘నన్ను మూఢనమ్మకస్తురాలు అనుకున్నా ఫరవాలేదు. కానీ, ఆటగాళ్లు ధరించిన కొత్త జెర్సీనే ప్రపంచకప్‌లో భారత జట్టు జైత్రయాత్రకు కళ్లెం వేసింది’’ అని ముఫ్తీ ట్వీట్ చేశారు. అంతకుముందు భారత్, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఇద్దరూ భారత్ గెలవాలని కోరకుంటున్నారని వ్యాఖ్యానించారు. కనీసం క్రికెట్ అంశంలోనైనా ఇరుదేశాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చారని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సైతం టీమిండియా ఓటమిపై స్పందించారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇంగ్లండ్, పాకిస్థాన్‌కి కాకుండా భారత్‌కి సెమీఫైనల్‌కు చేరేందుకు పరిస్థితులు కఠినంగా ఉండి ఉంటే ప్రదర్శన ఇంతే పేలవంగా ఉండేదా?’’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడిన టీమిండియా తొలి ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. 31 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై పరాజయం పాలైంది. కాగా, ‘హోమ్ అండ్ అవే’ నిబంధన వల్ల టీమిండియా ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
మీ కాషాయ పిచ్చ వలనే ఇండియా ఓడింది
Related tags :