గత 9ఏళ్లుగా పైరవీలతో పబ్బం గడుపుతూ, అధికారంలో ఎవరు ఉంటే వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తిరుమల కొండపై తిష్ట వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజును కొండ నుండి కిందకి దింపింది. ఆయన్ను తక్షణమే GADకు రిపోర్టు చేయవల్సిందిగా చీఫ్ సెక్రటరీ ఎల్.వీ.సుబ్రమణ్యం ఉత్తర్వ్యూలు జారీ చేశారు. తితిదే తిరుపతి జేఈవోగా పదవీవిరమణ చేసిన బీ.లక్ష్మీకాంతం స్థానంలో విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్ బసంత్ కుమార్‌ను నియమించి ఆయనకు తితిదే తిరుమల స్థానంలో బదిలీ అయిన శ్రీనివాసరాజు బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. తిరుమల జేఈవోగా కొత్తవారిని నియమించే అవకాశం ఉంది. శ్రీనివాసరాజు గత 9ఏళ్లుగా తెదేపా కాంగ్రెస్ హయాంలో తిరుమల కొండ నుండి కదలకుండా కూర్చున్నారు. ఆయన తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీ, అమరావతిల్లో భారీ లాబీయింగ్‌కు పాల్పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఆయన 9ఏళ్ల తితిదే “సేవలకు” తెరపడింది.
కొండ మీద పైరవీల జేఈఓ పీఠం కదిలిందిగా?
Related tags :