DailyDose

ఇండియాలో గణనీయంగా తగ్గిన కారు విక్రయాలు-వాణిజ్యం-07/02

Daily Business News - Car Sales Have Dropped Drastically In India-July2 2019

*దేశీ స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభ సెంచరీ లాభాలను కోల్పోయి దాదాపు 150 పాయింట్ల నష్టాలలోకి జారుకుంది. కానీ మిడ్‌ సెషన్‌ తరువాత మళ్లీ పుంజుకుని సెంచనీ లాభాలవైపు పయనిస్తోంది. సెన్సెక్స్‌ 71 పాయింట్లు ఎగిసి 39757 వద్ద, నిఫ్టీ సైతం 21 పాయింట్ల లాభంతో 11,888 వద్ద ట్రేడవుతోంది.
* బ్యాకింగ్ మోసాలకు సంబంధించి సీబీఐ మంగళవారం దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దానిలో భాగంగా ఆకస్మిక సోదాలు చేపట్టి 14 కేసులు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 18 నగరాల్లోని 50 ప్రదేశాల్లో బ్యాంకు మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటోన్న వివిధ కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లపై ఈ డ్రైవ్‌ చేపట్టింది. ‘బ్యాంకు మోసాలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సీబీఐ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. వివిధ కంపెనీలు, వాటి ప్రమోటర్లు, బ్యాంకు అధికారులతో కలిపి సోదాల అనంతరం 14 కేసులు నమోదు చేశాం’ అని ఓ అధికారి వెల్లడించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
*ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లను 0.10 శాతం మేర తగ్గించింది. ఫలితంగా అన్ని రకాల రుణాలు చౌక కానున్నాయి.
* భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎస్.రఘుపతి వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ – ఏసియా పసిఫిక్ నెట్వర్క్ (ఏపీఎన్) ఛైర్మన్గా రెండోసారి ఎంపికయ్యారు.
*ఆదాయం మరింత పెరిగితే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో 12, 18 శాతం శ్లాబుల్ని విలీనం చేసి రెండంచెల ఒకే పన్నును తీసుకొచ్చే అవకాశం ఉందని మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
*వినియోగదారులు లక్ష్యంగా ఇంజినీరింగ్, లైఫ్ సైకిల్ సేవలను అందిస్తోన్న క్వెస్ట్ గ్లోబల్ తన హైదరాబాద్ కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
*రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా ఎన్ఎస్ విశ్వనాధన్ మళ్లీ నియమితులయ్యారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
*వరుసగా రెండో నెలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. జూన్లో జీఎస్టీ వసూళ్లు రూ.99,939 కోట్లుగా నమోదయ్యాయి.
*ఉక్కు, విద్యుత్తు రంగాల్లో కనబరిచిన ఆరోగ్యకరమైన వృద్ధితో కీలక రంగాలు మెప్పించాయి. మేలో 5.1 శాతం వృద్ధి నమోదైంది.
*బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్ని (ఎన్బీఎఫ్సీ) నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు మరిన్ని నియంత్రణ, పర్యవేక్షక అధికారాల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు తెలియజేశారు.
*బ్యాంకింగ్ వ్యవస్థలో గతేడాదిలో క్లెయిము చేయని డిపాజిట్ల విలువ 26.8% మేర పెరిగి రూ.14,578 కోట్లకు చేరింది. వీటి విలువ 2017లో రూ.11,494 కోట్లు; 2016లో రూ.8,928 కోట్లు చొప్పున ఉన్నట్లు లోక్సభకిచ్చిన సమాచారంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2565 కోట్ల విలువైన మోసపూరిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్(ఐటీసీ) క్లెయిములను గుర్తించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
*వాహన విక్రయాల క్షీణత కొనసాగింది. గత నెల అమ్మకాల్లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ సహా దిగ్గజ సంస్థలన్నీ నిరాశపరిచాయి.