ఎల్లుండి నుండి వాషింగ్టన్ డీసీలో ప్రారంభం కాబోతున్న తానా 22వ మహాసభల్లో వివిధ జిల్లాలకు చెందిన ప్రవాసులు ప్రాంతీయ సమావేశాల పేరిట ఒకేచోట జేరి ఊసులాడనున్నారు. కృష్ణా, చిత్తూరు, ఖమ్మం, గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసులు ఈ సభలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానించి సత్కరించనున్నారు. తమ ప్రాంతానికి ప్రత్యేకమైన వంటకాలను ఈ సందర్భంగా వారు అతిథులకు అందించనున్నారు.
తానా సభల్లో ప్రాంతీయ సమావేశాలకు సన్నాహాలు
Related tags :